శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు ఇండియన్ హెర్కులస్.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మల్లయోథుడు కోడి రామ్మూర్తి నాయుడు గారు క్రీ॥శ॥1880 సం॥ శ్రీకాకుళం జిల్లా పాలకొండ సమీపంలోని "వీరఘట్టం” అనే పల్లెటూరిలో తెలగ కాపు కులములో జన్మించారు. మధ్యతరగతి రైతు కుటుంబము వారి తల్లిదండ్రులు. కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండమ్మ గార్లు.

సర్కిల్ ఇన్స్పెక్టరు (పోలీస్ శాఖ)గా విజయనగరములో పనిచేస్తున్న పినతండ్రి కోడి నారాయణస్వామి నాయుడు పెంపకములో పెరిగి విజయనగరము. మహారాజా హైస్కూలులో చదువుకున్నాడు. చిన్న వయస్సు నుండి రామ్మూర్తి నాయుడు దండీలు బస్కీలు; కసరత్తు, ప్యారలెల్బార్, రోమన్ రింగ్స్ వాటిపై ఆసక్తి చూపేవాడు.

ఒకసారి ఊబిలో పడిన ఎద్దును ఎవరి సహాయము లేకుండా ఒక్కడే రక్షించి విజయనగర వాసుల ప్రశంసలు పొందాడు. వ్యాయామ విద్య, ప్రాణాయమము, హరయోగము, ద్వారా అద్భుతాలు సృష్టించాడు. నాయుడిగారి జీవితంలో ప్రతి సంఘటనా అద్భుతమే కొద్దికాలం స్థానిక విజయనగరం మహారాజా కాలేజీలో "డ్రిల్లు మాస్టర్"గా చేశాడు. వాయుస్థంభనలో ఆయన ఛాతి 12 పెరిగేది.

విజయనగరంలో సర్కస్ కంపెనీ వారు ప్రదర్శనలు, కుస్తీ పోటీలు నిర్వహించగా అందులో నాయుడు బలశాలులపై పోటీ చేసి గెలిచి అందరిని ఆశ్చర్యపరచారు. రామ్మూర్తి నాయుడు స్వయంగా సర్కస్ కంపెనీ పెట్టుటకు ప్రయత్నించుచుండగా అది తెలిసి ఆయనకు వ్యాయామ క్రీడలపై గల ప్రతిభను గుర్తించిన తుని మహారాణి ఆర్థిక సహాయము అందించి ప్రోత్సహించారు.

రామూర్తి నాయుడు బృందము రంగూన్, నేపాల్, కాశ్మీరు, గదగ్, కాశీ, గయ, ప్రయాగ, హరిద్వార్; బృందావనము, రష్యా వరకుఅనేక దేశాలు పర్యటించి ప్రదర్శనలిచ్చిప్రశంసలు పొందారు. రంగూన్ ప్రదర్శన సమయములో కుస్తీ పోటీలలో పాల్గొన్న సయ్యడి సోదరులు (పహిల్వాన్)ను చిత్తుచిత్తుగా ఓడించారు. వారు చంపడానికి ప్రయత్నించగా తప్పించుకున్నాడు. ఇంకొకసారి రష్యా ప్రదర్శనలో ఆహారములో విషము కలిపారు. అది గమనించిన నాయుడు “ప్రాణాయామం” చేసి విషాహారము జీర్ణించుకొని మూత్రం ద్వారా విసర్జించారు. ఒకసారి పెద్ద తుఫాను గాలి దాటికి డేరాలు, సర్కస్ గూడారాలు కుప్పకూలిపోగా సర్కస్ ఏనుగు ఇనుపగొలుసు తెంపుకొని నాయుడు ఛాతీపై కాలువేసి తొక్కింది అదృశ్యము చూచిన జనం, ఆయన చనిపోయి ఉంటాడని భావించారు. ఏనుగు కాళ్ల క్రింద నలిగినా అతను చెక్కు చెదరలేదు. అప్పటి నుండి ఏనుగును తన ఛాతీపై ఒక చెక్కవేసి దానిపై ఎక్కించుకొనుట వారి సర్కస్ ప్రదర్శనలో ముఖ్య ఆకర్షణగా నిలచింది... దానితో జనము నాయుడుగారికి, డబ్బు సన్మానాలందించారు.

ప్రపంచ విదేశాల పర్యటనలో ఈ ప్రదర్శన ఎంతో ఆకర్షణగా నిలిచింది. 1907 సం||లో జగద్విఖ్యాతి గాంచిన ఐరోపా వాసి “ఈజెన్శౌండో” మన దేశానికి వచ్చి కొందరు మల్లయోధులనోడించి సవాల్ విసిరాడు. నాయుడు ఆ మాటకి ప్రతి సవాల్ విసిరి ఆ పోటీలో కుస్తీ గోదాము నుండి శాండోను పైకెత్తి బయటకు విసిరివేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. ఇంగ్లండు, ఐరోపా దేశ పర్యటనలలో సాధించిన అఖండ విజయము వలన నాయుడు గారికి అంతర్జాతీయ ఖ్యాతి లభించినది. ప్రాచ్యాత్యదేశాలలో పర్యటించిన మొట్టమొదటి వస్తాదు రామ్మూర్తి నాయుడు గారే! విక్టోరియా మహారాణి "కలియుగ భీమ" బిరుదు నిచ్చి సన్మానించింది- ఐరోపాలో ఇండియన్ హెర్కులెస్ అని బిరుదు నిచ్చారు.

ఆయన ఛాతి చుట్టుకొలత 48 అంగుళాలు, ఊపిరి బిగబట్టినపుడు ఒక అడుగు చుట్టుకొలత పెరిగేదట, ఆ రోజులలో గాని, ఈ రోజులలో గాని ఊపిరి బిగబట్టి 1 అడుగు చుట్టుకొలత (ఛాతి) పెంచగల మగధీరుడు ప్రపంచములో లేడు, లేడు ఇక పుట్టబోడు.

జాతీయ కాంగ్రెసు సభలలో పాల్గొని బలప్రదర్శనయిచ్చి ప్రశంసలు పొందేవారు. బాల గంగాధర తిలక్ గారు ఈయన ప్రతిభకు ప్రశంసల జల్లు కురిపించారు.

కుస్తీ పోటీలో తనను ప్రపంచములో ఎవరైనా ఓడిస్తే 1 లక్ష రూపాయలు బహుమతి ఇస్తానని ఆయన ప్రదర్శనకు వెళ్లిన విదేశాలలో ప్రకటించాడు. విదేశీ పత్రికలు ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించాయి. ఆయన సవాల్ను ఎదుర్కొని నిలిచినవారు ఆ కాలములో సాహసవంతులెవ్వరూ ముందుకు రాలేదు. ఇంతటి పరాక్రమశాలి అయిన నాయుడు స్వచ్ఛమైన శాఖాహారి మాత్రమే!

ఒకసారి “జయపూర్”లో ఆగి ఉన్న రైలింజన్ను ఒక గడ్డ పార నాటి కాలు తన్ని పట్టి రెండు చేతులు రైలింజనుకు ఆనించి రైలును డ్రైవరును నడపమన్నాడు. ప్రజలందరూ ఆశ్చర్యకరముగా చూస్తుండగా రైలు చక్రాలు గిరిగిరా తిరుగుతున్నాయి. కానీ రైలు ఒక్క అంగుళం కదలలేదు. ప్రజల ప్రశంసలు తోటి డబ్బు వర్షము కురిపించి పట్టణమంతా ఊరేగించారు.

రామూర్తినాయుడు మూడు గడ్డ పారలను జడలాగా పేనేవాడు. ఆయన శిష్యులైన పోతుల సీతారామయ్య నాయుడు గారు (గోదావరి జిల్లా) ఒంగోలు కాపు నాడు సభలో ఆయన చూసిన వింతను వివరించారు. ఆయన శాఖాహారి అని ఆయన ఆహారము పట్ల, తన సిద్ధాంతాన్ని తన శిష్యులు కూడా ఆచరించేటట్లు చేశారు. ఎల్లప్పుడు హఠ యోగాభ్యాసము చేసేవారు.

నాయుడు గారి బలప్రదర్శన విషయము తెలిసినంతగా ప్రజలకు అతను చేసిన దానధర్మాల గొప్పతనము గురించి తెలియకపోవచ్చును. దానికి కారణం ఆయన గుప్తదానాలు చేయడమే, దాదాపు ఆయన చేసిన గుప్తదానాలు, రెండు కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా! అప్పటి జమీందారులు, సంస్థానాధీశుల ఎస్టేటుదారులు చేసిన దాననిరతిని అధికమించారు నాయుడుగారు తన సర్కస్ కంపెని, కుస్తీ పోటీలలో వచ్చిన ఆదాయము తనను నమ్ముకున్న తన తోటి శ్రమించే కుటుంబాలకు, పేదలకు, పేద విద్యార్థులకు, కుస్తి తాలీంఖానాలకు విరాళంగా యిచ్చేవారు. యింత గొప్ప బలశాలి, దాత అయిన నాయుడు గారు తన "ఏబయిఐదవ ఏట" డబ్బులేక చాలా యిబ్బందులు పడ్డారు. కారణం అదే సమయంలో సర్కస్ కంపెనీలకు నష్టం రావడం; కంపెనీ మూసి వేయడం, ఒక ప్రదర్శనలో ఛాతీపై ఏనుగును ఎక్కించుకొనేటపుడు కుట్రతో పలచని చెక్క వేసినందువలన చెక్క విరిగి ఏనుగు కాలు ఆయన ఛాతీపై పడి ఒక ప్రక్కటెముక విరిగింది. వైద్యము చేయగా మానింది. కానీ మరలా ఆ ప్రదర్శన చేయుటకు వీలుపడలేదు.

వారణాశి (కాశీ)కి పిలిపించి, కాశీ హిందూ విశ్వవిద్యాలయములో గౌరవ వ్యాయామ

రామ్మూర్తి నాయుడు ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న "మదన్ మోహన మాలవ్యా సలహాదారుగా నియమించి సహాయపడ్డారు. అదే సమయములో అతని ఎడమకాలి మెడిమపై కురుపులేచి అది పెద్దదై అది సెప్టిక్ అయి డాక్టర్లు కాలుతీసి వేశారు. (కొందరు జైపూరు మహారాజు మరదలు ఇతనిపై మనస్సు పడిందని ఇతనికి ఇష్టంలేక దూరంగా ఉన్నాడని ఒకరోజు రాత్రి ఆమె నాయుడు గదికి రాగా ఆయన రాజు గారు చూస్తే చంపివేస్తాడని భయపడిపై అంతస్థు నుండి దూకి కాపలావారిని కొట్టి పరుగెత్తాడని, కాలు విరిగి, సరైన వైద్యము లేక సెప్టిక్ అయిందని ప్రచారము కలదు)

1938 సం||లో ఒరిస్సా బలంగీరు సంస్థానంలో బసచేసి ఉండగా జనవరి

16 తేదీ నాయుడు గారు స్వర్గస్థులయ్యారు. సంక్రాంతి భోగిపండుగ రోజు రాజలాంఛనాలతో దహన క్రియలు జరిగాయి.

మహాక్రీడావేత్త తెలుగువారి కీర్తి ఖండ, ఖండాంతరాలలో వ్యాపింపచేసిన మహావ్యక్తి

ఆయన కాపు కులములో జన్మించడం కాపు కులం చేసుకున్న అదృష్టం. ఆయన పేరుతో వ్యాయామశాలలు ఏర్పాటుచేసి భవిష్యత్తులో భారతావనికి మరో రామ్మూర్తి నాయుడిని అందించగలరని ఆశిద్దాం.

కలియుగభీమ, ఇండియన్ హర్లస్, మల్లమార్తాండ, జగదేకవీర, శాండో, జయవీర కంఠీరవ, బిరుదులు పొందారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం గ్రామం- తెలగవీధిలో - కూరాకుల వీధిలో వారింట్లో ఇప్పుడు పాఠశాల నడుస్తూ ఉంది. 12 సం|| వయస్సులో రాయలచెరువులో ఈత ఈదేవారని, మద్రాసు వ్యాయామ కళాశాలలో ట్రైనింగ్ అయి, పూసపాటి అలకనందరాజు కళాశాలలో వ్యాయామ శిక్షకుడిగా, ఉంటున్నప్పుడు,పొట్టిపంతులు అనే టీచరు, సర్కస్ కంపెనీ ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుందని సలహా యిచ్చాడు. అవసరాల రామకృష్ణారావు గారు వ్రాసిన కోడి రామ్మూర్తి నాయుడు భవిష్యత్కు మేలు కొలుపు గ్రంథంలో ముల్లంగి వెంకట రమణారెడ్డి ఆయన దానగుణముల గురించి వ్రాశారు. ఆయన బ్రహ్మచారి వారి మూడవతరం వారు. లలితా త్రిపురసుందరి. (మనుమరాలు) గారున్నారు.

రచయత -శ్రీ బట్టరుశెట్టి పద్మారావు రాయలు