పసుపులేటి కన్నంబ(Film Actor)

చిత్ర పరిశ్రమ అనే వినీలాకాశంలో ఎల్లప్పుడూ ధృవతారగా వెలుగొందిన నట విదూషీమణి. పసుపులేటి కన్నాంబ ప్రసిద్ధ గాయనిగా, రంగస్థల నటిగా, చలనచిత్ర తారగా అత్యుత్తమ స్థాయిని పొందిన కన్నాంబ 1912లో కాపు కుటుంబంలో ఏలూరు నందు జన్మించారు. బాల్యమంతా ఏలూరులోనే గడిచింది. తన 13వ ఏట ఏలూరులోని “నావెల్ నాటక సమాజం” వారి నాటకంలో బాలపాత్రను ధరించడంతో కన్నాంబ రంగ స్థలంపై కాలుపెట్టారు. స్త్రీలు వీధుల్లోకి రావడానికి జంకే ఆ రోజుల్లో కన్నాంబ రంగస్థలి నటిగా ప్రవేశించడం ఎంతో సాహసమనే చెప్పాలి. క్రమంగా విభిన్న పాత్రలను పోషిస్తూ తన గంభీరమైన కంఠంతో సంభాషణలను పాత్రోచితంగా పలుకుతూ అగ్రశ్రేణి నటిగా నాటకరంగంలో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారు. రంగూన్ రౌడి, సతీ సావిత్రి, సతీ అనసూయ, హరిశ్చంద్ర మొదలైన నాటకాలలో నాటి ప్రసిద్ధులైన నటీనటులందరితోనూ కన్నాంబ నటించారు. తీయని కంఠస్వరంతో మృదు మధురమైన రాగాలాపనతో ఆంధ్రుల హృదయంలో సుస్థిర స్థానాన్ని పొందారు. కన్నాంబ ఆలపించిన “కృష్ణం భజే రాధా” అనే గ్రామ్ఫోన్ రికార్డు, పాట నాటి ఆంధ్ర ప్రజలను ఉర్రూత లూగించింది. తరువాత కొద్ది కాలానికే "రాజరాజేశ్వరీ నాట్యమండలి" స్థాపించి ఆంధ్ర దేశంలోని అనేక పట్టణాలలోనూ ప్రదర్శనలు చేశారు.

1935 సం॥లో స్టార్ కంబైన్స్ వారి హరిశ్చంద్ర తెలుగు చిత్రంలో చంద్రమతిగా చిత్రసీమలో ప్రవేశించి అగ్రశ్రేణి తారగా వెలుగొందారు. 1936లో కొల్హాపూర్, సరస్వతీ టాకీస్ వారు నాటకరంగంలోనని ప్రసిద్ధ నటీనటులతో నిర్మించిన ద్రౌపదీ వస్త్రాప హరణంలో కన్నాంబ ద్రౌపదిగా నటించింది. ఇది ఆమె రెండవ చిత్రం 1940లో కన్నాంబ చండిక చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో అందులకై ఆమె ప్రతిరోజూ చిరుతపులులకు కన్నాంబ చిరుతపులలతో నటించ వలసి వచ్చింది. ఆహారం మంచినీళ్ళు అందిస్తూ, మచ్చిక చేసుకున్నారట. అంతటి ధైర్యవంతురాలు. “చండిక” చిత్రంలో “నేనే రాణినైతే" అనే పాటలో ఆమె నటనా కౌశలం అద్వితీయమని ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. కన్నాంబ “కృష్ణన్తూడు” అనే తమిళ చిత్రంలో నటించి తమిళుల ఆదరణ పొందారు.

"మనోహర" తమిళ చిత్రం థియేటర్లలో ప్రదర్శింపబడుతున్నది. ఆ చిత్రంలో హీరో శివాజీ గణేషన్ పెద్ద సంభాషణ చెప్పాడు. అంతకంటే పెద్ద సంభాషణని ఆవేశంగా ఉద్వేగంగా (తల్లిపాత్ర) కన్నాంబ చెబుతూఉంటే ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు. అంతకుముందు కూడా అలాగే “కణ్ణగిజి" తమిళ చిత్రంలో ఆమె సంభాషణలకీ అదే హర్షధ్వానాలు చప్పట్లు మారు మ్రోగాయి. ఆమె ప్రసిద్ధ తెలుగు నటీమణి ఆమె నాటకాల్లో వివిధ పాత్రలు ధరించింది. హరిశ్చంద్ర సినిమా (1935)లో ఆమె చంద్రమతిగా, లోహితుడు మరణించినపుడు శ్మశానంలో చితిమీద పెట్టి చెప్పిన శోక సంభాషణలకు ఆమె ఆవేదనకూ నాటి ప్రేక్షకులు శోకభరితులయ్యారు. కన్నాంబవి పెద్ద కళ్ళు, విశాలమైన ముఖం తీరైన ముక్కు కన్నాంబ శోక పాత్రలకే పెట్టింది పేరు అనుకున్న ప్రేక్షకుల మనోభావాలను ఆమె తిప్పి కొట్టింది. చండిక (1940) సినిమాలోని పాత్ర గంభీరమైనది. పొగరుతో నిండుకున్నది. గుర్రం మీద స్వారీ చేస్తూ చేతితో కత్తి పట్టుకొని “నేనే రాణినైతే ఏలనె ఈధర ఏకధాటిగా" అని విర్రవీగుతూ పాడుతూ ఉంటే జనం నివ్వెరపోయారు. ఆ సినిమాలోనే ఇంకో పాట “ఏమే ఓ కోకిలా" ఏమో పాడెదవు; ఎవరే నేర్పినది ఈ పాట "ఈ ఆటా” అన్నది. ఇందులో పాట మధ్యలో నవ్వులున్నాయి. అలా నవ్వుతూ మళ్ళీ పాట అందుకొని పాడడం ఆమెకే గాని అన్యులకు కుదరదు అనుకున్నారు. నాటి ప్రేక్షకులు పల్నాటి యుద్ధం (1947)లో ఆమె నాగమ్మ ఈర్యా క్రోధాలు నిండి ఉన్న పాత్ర “హరిశ్చంద్ర"లోని చంద్రమతికి ఆమెతో పాటు విలపించిన అదే ప్రేక్షకులు, నాగమ్మ పాత్ర చూసి తిట్టుకున్నారు. అది ఆమె నటనా ప్రభావం ఆమె కళ్ళు కరుణ రసాన్ని ఒలికిస్తాయి క్రోధాన్ని పలికిస్తాయి.

మద్రాసు చేరుకున్న దగ్గర్నుంచి తమిళ భాష నేర్చుకోవడం మొదలు పెట్టి శుద్ధ గ్రాంథిక తమిళంలో సంభాషణలు చెప్పడం వరకు తీవ్రమైన కృషి చేశారు. కన్నాంబ మా తమిళ నటే. తెలుగులోనూ నటిస్తుంది అనుకునేవారు తమిళ ప్రేక్షకులు. కన్నాంబనటించిన కొన్ని చిత్రాలు ద్రౌపది వస్త్రాపహరణం, గృహలక్ష్మి కనకతార, పాదుకా పట్టాభిషేకం, అనార్కలి దక్షయజ్ఞం, ముగ్గురు కొడుకులు, రాజమకుటం, తోడికోడళ్ళు, సక్కూబాయి ఆత్మబంధువు, వివాహబంధం రామదాసు, తల్లిప్రేమ, మనోహర, మాంగల్యం వివాహబంధం, ఆమె చివరి చిత్రం, రామదాసు సినిమా నిర్మాణంలో ఉండగా మరణించారు.

కన్నాంబ నట జీవితాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి ఆమె భర్త కడారు నాగభూషణం (కడపజిల్లా నివాసి) గారు కూడా నాటకాలలో నటించేవారు. కన్నాంబ తన భర్త నాగభూషణం (బి.సి. కులం) కలిసి శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిమ్ కంపెనీ నెలకొల్పి, తెలుగు తమిళ చిత్రాలు 30 వరకు నిర్మించారు. ఆ సంస్థకు ఒక మంచి సాంప్రదాయముండేది జీతాలు ఇవ్వవలసిన వాళ్ళందరికి ఒకటవ తేదీ రాకుండానే నెలాఖరురోజునే ఇచ్చేసేవారు. వారిది పెద్ద ఆఫీసు. ఆ ఆవరణంలో 20 కార్లు నిలబడేంత స్థలం సినిమాలు నడిచినా నడవకపోయినా వరుసగా తీసేవారు. కన్నాంబ హీరోయిన్ కాకపోయినా అంతగ్లామరుండేదామెకు.

ఆ రోజుల్లో చీరెలు, నగలకు సినిమాతారలు పేరు పెట్టి అమ్మేవారు (ఇటీవల టైటానిక్ చీరెలు అని వచ్చినట్లు) కాంచనమాల గాజులు కన్నాంబ లోలాకులు అని వస్తువులు అమ్మేవారు. ఆమె ఐశ్వర్యవంతురాలని డబ్బును బంగారు నాణాలుగా మార్చి పోపుల డబ్బాలో వేసి వంటింట్లో వుంచేదనీ చెప్పుకునేవారు (ఆమె మరణించిన తదన ఈ విషయం తెలిసిందట) దానగుణం, దయాగుణం కూడా ఆమె ప్రజ్ఞ ఉండేది. సినిమా షూటింగ్స్ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ క “రడీ” అనగానే కన్నాంబ తన పాత్ర మూడ్లోకి వెళ్ళిపోయేవారు. శోకిస్తూ పెళ్లి చెప్పవలసి వస్తే, సంభాషణతో పాటు కన్నీరు కూడా వచ్చేసేది. “గ్లిసదన్", లేకుండా అలా లీనమై నటించినవారు తక్కువ మంది ఉంటారు. స్త్రీలు నటించడం కన్నాంబతో మొదలైనదట. రామదాసు నిర్మాణం మరణిస్తే “డూప్”ని పెట్టి మిగిలిన దృశ్యాలు పూర్తిచేశారు. నాగయ్యగారు. సంభాషణల్ని టి.జి. కమలాదేవితో డబ్ చేయించారు.

1964-మే నెల -7వ తేది కన్నాంబ మరణవార్త తెలిసి ఉభయభాషల సినిమా వారు అభిమానులూ వేల సంఖ్యతో అంతిమయాత్రలో పాల్గొన్నారు. వారి సంస్థ నిర్మించిన "నవజీవనం" అనే చిత్రాన్ని ఉమ్మడి మదరాసు ప్రభుత్వం, ఉత్తమచిత్రంగా నిర్ణయించి కన్నాంబను ఘనంగా సత్కరించారు. 30 సం॥రాలు తేజోవంతంగా ప్రకాశించిన తారామణి తన 52 యేట తెల్లవారుఝామున మదరాసు నగరంలో తన స్వగృహంలో మరణించారు. అయితే అంత ఘనమైన వీడ్కోలు జరిగిన ఆ మహానటికి చివర అపశృతి పలికింది. కన్నమ్మ పేట శ్మశానంలో (మద్రాసు) ఆమెను పూడ్చివేశారు. ఖరీదైన పట్టుచీరె, ఒకటి, రెండు బంగారు నగలూ ధరించిన ఆ భౌతికదేహాన్ని వారి సాంప్రదాయం ప్రకారం అలాగే గోతిలో దింపారు. మర్నాడు ఉదయం ఆ స్థలంలో పాలు పొయ్యడానికి వెళ్తే ఆమె శరీరం గోతి నుండి బయటకు వచ్చి నగ్నంగా పడి వుంది. ఏ అభిమానో చివరి దర్శనం చేసుకోడానికా? కాదు. ఆ పట్టుచీర, నగలూ తస్కరణ కోసం కన్నాంబ దంపతులకు సంతానం లేదు. వారు వారి బంధువుల అమ్మాయిని పెంచుకున్నారు. ఆమెను డైరెక్టరు సి.ఎస్.రావు కిచ్చి వివాహం చేశారు. వారు విదేశాలలో సెటిలయ్యారు

రచయత : భట్టారుశెట్టి పద్మారావు రాయలు