🎬 సినీ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్

BANDREDDI SUKUMAR

సుకుమార్ అసలు పేరు బండ్రెడ్డి సుకుమార్ (Sukumar Bandreddi). తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడు, కథా రచయిత, స్క్రీన్‌ప్లే రచయిత, నిర్మాతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన సినిమాల్లో సంక్లిష్టమైన కథనం, కొత్త తరహా పాత్రలు, భావోద్వేగాలు మరియు కథలో ట్విస్టులు ముఖ్యమైన లక్షణాలుగా కనిపిస్తాయి. 

👶 బాల్యం – కుటుంబ నేపథ్యం

సుకుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి ప్రాంతంలోని మట్టపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి తిరుపతి రావు నాయుడు బియ్యం వ్యాపారం చేసేవారు; తల్లి వీర వేణి గృహిణి. ఆయన ఆరుగురు సంతానంలో చిన్నవారు. 

రాజోలు జడ్పీ హైస్కూల్‌లో చదువుకున్న ఆయన గణితంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

👨‍🏫 లెక్చరర్‌గా జీవితం

సినిమాల్లోకి రాకముందు సుకుమార్ కాకినాడలోని ఆదిత్య జూనియర్ కాలేజీలో గణితం, ఫిజిక్స్ లెక్చరర్‌గా సుమారు ఆరు–ఏడు సంవత్సరాలు పనిచేశారు. అయితే సృజనాత్మక రంగంలో పనిచేయాలనే ఆసక్తితో సినిమా వైపు అడుగులు వేశారు. 

🎥 సినిమా రంగంలోకి ప్రవేశం

మొదట రచయితగా సినిమా రంగంలో ప్రయత్నాలు ప్రారంభించారు. తరువాత ఎడిటర్ మోహన్ వద్ద పనిచేశారు. అలాగే వి.వి. వినాయక్ వద్ద Dil (2003) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

🌟 దర్శకుడిగా తొలి చిత్రం – ఆర్య

2004లో వచ్చిన Arya సుకుమార్ దర్శకత్వ ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించారు.

ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో సుకుమార్ ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందారు. Aryaకు ఆయన Filmfare Best Director – Telugu అవార్డును, Nandi Award for Best Screenplay Writer అవార్డును అందుకున్నారు. 

🎬 ముఖ్యమైన సినిమాలు

సంవత్సరం

సినిమా

ప్రధాన పాత్ర

2004

Arya

దర్శకుడు, రచయిత

2007

Jagadam

దర్శకుడు, రచయిత

2009

Arya 2

దర్శకుడు, రచయిత

2011

100% Love

దర్శకుడు, రచయిత

2014

 Nenokkadine

దర్శకుడు, రచయిత

2016

Nannaku Prematho

దర్శకుడు, రచయిత

2018

Rangasthalam

దర్శకుడు, రచయిత

2021

Pushpa: The Rise

దర్శకుడు, రచయిత

2024

Pushpa 2: The రూల్

ఈ చిత్రాలన్నీ ఆయన దర్శకత్వ ప్రస్థానంలో ముఖ్యమైన మైలురాళ్లుగా నిలిచాయి.

🏆 రంగస్థలం – మరో కీలక మలుపు

2018లో వచ్చిన Rangasthalam గ్రామీణ నేపథ్యం, పాత్రల రూపకల్పన, కథనం కారణంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించారు.

🔥 పుష్ప – జాతీయ స్థాయి గుర్తింపు

2021లో Pushpa: The Rise ద్వారా సుకుమార్ దర్శకత్వం తెలుగు రాష్ట్రాలను దాటి దేశవ్యాప్తంగా మరింత విస్తృతమైన ప్రేక్షకులను చేరుకుంది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించారు.

దీనికి కొనసాగింపుగా 2024లో Pushpa 2: The Rule విడుదలైంది. ఈ చిత్రానికి కూడా సుకుమార్ దర్శకత్వం వహించారు. 

🎞️ నిర్మాతగా

సుకుమార్ Sukumar Writings బ్యానర్ ద్వారా నిర్మాతగానూ సినిమాలు నిర్మించారు. Kumari 21F, Uppena, Virupaksha వంటి చిత్రాలతో నిర్మాతగా కూడా ఆయన

పనిచేశారు

✍️ సుకుమార్ ప్రత్యేకత

సుకుమార్ సినిమాల గురించి సాధారణంగా చెప్పబడే ముఖ్యమైన అంశాలు:

కొత్త తరహా కథలు

బలమైన స్క్రీన్‌ప్లే

పాత్రలలో భిన్నమైన షేడ్స్

సైకాలజీ, ఎమోషన్స్‌కు ప్రాధాన్యం

కథలో ట్విస్టులు

సాధారణ కథనాన్ని విభిన్నంగా చూపించడం

పాత్రల అంతర్గత సంఘర్షణలను తెరపై చూపించడం

👨‍👩‍👧‍👦 వ్యక్తిగత జీవితం

సుకుమార్ 2009లో తబితా సుకుమార్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

📌 ఒక మాటలో సుకుమార్ ప్రయాణం

లెక్చరర్ → రచయిత → అసిస్టెంట్ డైరెక్టర్ → Arya దర్శకుడు → విజయవంతమైన దర్శకుడు → నిర్మాత → Rangasthalam, Pushpa వంటి చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన దర్శకుడు.

      * జీవితంలో ప్లస్సులూ మైనస్సులూ, కెరీర్లో ఈక్వేషన్సు, కాలిక్యులేషన్లూ బొత్తిగా పట్టని అంతర్ముఖుడు సుకుమార్. గణితంలో ఆరితేరిన అధ్యావకుడు, ఫార్ములా సినిమాలకు కొత్త సొల్యూషన్ వెతికే అన్వేషి, ఆ ప్రయాణంలో ఇన్నాళ్ళకు “రంగస్థలాన్నే” జయించాడు. సుకుమార్ను దర్శకుడి కోణం చూశాం. అధ్యాపకునిగా, పుస్తక ప్రేమికునిగా, ఫ్యామిలీ మ్యాన్గా, ఆయనలోని కోణాలు అనేకం. మొదట్లో తెలియని కాన్ఫిడెన్సేదో మనల్ని నడిపిస్తుంది. సంకోచాలు, భయాలు ఉన్పప్పటికీ ఆత్మ విశ్వాసం ఉరకలేస్తుంటుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నాలోనూ అదే జోరు ఉండేది. అయితే అప్పటికే   లెక్చరర్ గా వచ్చే సంపాదనను వదులుకొని సినీరంగంలోకి అడుగుపెట్టాను. తిరిగి సక్సెస్ తో వెళతానా? లేదా? అనే భయాలు మాత్రముండేవి. కుటుంబానికి నేనెపుడూ అండగా ఉండగలుగుతాను? అని మదన పడేవాణ్ని. ఇంట్లోవాళ్ళు ఫోన్ చేస్తే చాలు. ఏడుపు వస్తుందేమో నన్నంత బాధ ఉండేది. అందుకే ఒక సంవత్సరము మీకు దూరంగా ఉంటాను నన్ను డిస్ట్రబ్ చేయొద్దు అని ఇంట్లో చెప్పేశాను. అనుకున్నట్లు 365 రోజులు మాట్లాడలేదు. తొలి ప్రయత్నంలో భాగంగా ఆరుగురు హీరోలకు కథ వినిపించాను. కొత్తలో కథ చెప్పడం సరిగా వచ్చేది కాదు. తంటాలు పడితే ఆఖరుకి “ఆర్య” ఓ.కె.అయ్యింది.

      నా కుమార్తె సుకృతవేణి, అబ్బాయి సుక్రాంత్. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి నాలాగే సున్నిత మనస్కురాలు. నా కన్ఫ్యూజన్ తనకూ వచ్చింది. నేను రెండవ ఫ్లోర్లోనూ, మా అన్నయ్య ఏడవ ఫ్లోర్లోనూ ఉంటున్నాం. లిఫ్ట ఎక్కగానే ఏ ఫ్లోర్కు వెళ్ళాలో సందిగ్ధంలో పడిపోతుంటాను. ఆ పిల్ల కూడా అలాగే అవస్థపడుతుంటుంది. ఇక అమ్మాయికి పూర్తిగా ఆపోజిట్ అబ్బాయి సుక్రాంత్. వాడు పుట్టాక తనను తక్కువ చేస్తున్నానేమోనని ఇన్సెక్యూర్ అయ్యింది అమ్మాయి. అందుకని ఆమెను ఎక్కువగా చూడడం మొదలుపెట్టాము. దీంతో అబ్బాయి ఇండిపెండింటు అయ్యాడు. షూటింగ్కు వెళ్ళినప్పుడు పిల్లలు గుర్తుకొస్తే ఆ క్షణమే పరుగెత్తి ఇంట్లో వాలిపోవాలనిపిస్తుంది. పిల్లల్ని గట్టిగా గుండెలకు హత్తుకొని వాళ్ళ స్పర్శలోని ఆత్మీయత పొందాలనిపిస్తుంది. వీడియోకాల్లో డాడీ, డాడీ అంటూ చేతులు చాస్తుంటారు. ఆ దృశ్యం నాకు భరించలేని పెయిన్.

బావగారూ బాగున్నారా!" సినిమా తీస్తున్న సమయం అది. నేనప్పుడు అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేస్తున్నాను. అప్పటికింకా ఇమ్మెచ్యూర్ ఏమి రాస్తున్నానో తెలిసేది కాదు.

చకచకా మూడంటే మూడే సీన్లు రాశాను. ఎందుకో అవి వాళ్ళకు నచ్చలేదు. అంతటితో ఆ సంగతి వదిలేసి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాను. ఫెయిల్యూర్ కూడా మరో ప్రయత్నానికి అవకాశం ఇస్తుంది కదా! - మన చుట్టూ ఉన్నవాళ్ళే మనల్ని ప్రభావితం చేస్తుంటారు. అలాంటి నలుగురే వీళ్ళు ఒకరు. వేమారెడ్డి ఇన్స్పెరింగ్ క్యారెక్టర్ సినిమాలంటే ప్రాణం. ఏ విషయాన్నయినా మూడో కోణంలో చూడడం అతడిని చూశాకే నేర్చుకున్నాను. రెండో వ్యక్తి రవికుమార్ కెమిస్ట్రీ లెక్చరర్ దేన్నీ లెక్కచేయడు త్యాగం అతని ట్యాగ్లన్. మూడో వ్యక్తి రామ్మోహనరెడ్డి. మా గురువు ఒకప్పుడు ఆయన వద్ద విద్యార్థిని ఆ తర్వాత లెక్చరర్ అయ్యాక కొలిగి నయ్యాను. నువ్వు ఫలానామార్గంలో వెళితే తప్పక సక్సెస్ అవుతావు అని మనలో మనకే తెలియని ప్రతిభను వెలికితీసి అద్దంలో చూపించే అద్భుతమైన వ్యక్తి, నా సినిమాలు రిలీజయ్యే టైంలో ఆయనకు నిద్రపట్టదు. "మావాడు తీసింది ఆడుతుందా! జనాలకు నచ్చుతుందా. ఇదే టెన్షను రెండ్రోజులకు హిట్ టాక్ వచ్చాకే ఆయన మనస్సు కుదుటపడుతుంది. ఇక నాలుగు వ్యక్తి హరిప్రసాద్ అతని కాన్ఫిడెన్స్ చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. దేనికీ టెన్షన్ పడడు. వర్ధమానమే లెక్క ఈ రోజు అనేదే వేడుక రెండో ఆలోచనే ఉండదు. ఇలా వీళ్ళందరి ప్రభావం. నా మీద ఉంది.

లాజిక్లు, మ్యాజిక్లు తెలియదు. కానీ ఒక సీనును పలువిధాలుగా ఊహించగలిగే తార్కిక నైపుణ్యాన్ని మాత్రము గణితమే నేర్పింది. డిగ్రీ సెకండ్ ఇయర్ మాథ్స్ “రియల్ ఎనాలసిస్" ఆ కోవలో ఉపయోగపడిందే. అది నాలో కొత్త డైమెన్షన్ను ఓపన్ చేసింది. పర్మిటేషన్స్ అండే కాంబినేషన్స్ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా ఎతకాలో చెప్పింది  ప్రాబ్లం సాల్వింగ్ అనేది సినిమా రచనలో క్లిష్టప్రశ్నలు వేసుకునేలా చేసింది. “రంగస్థలం” చిత్రాన్నే తీసుకుందాం. వినికిడిలోపమున్న ఓ పాత్ర ఒక సంఘటనకు ఎన్ని విధాలుగా స్పందిస్తుంది. లెక్కవేసుకునేలా చేసింది. లెక్క వేసుకోగలిగే సామర్థ్యం అన్నమాట, సమంత ఐ లవూ చెబుతుంది. రామ్ చరణ్ కు ఆమాటే వినపడదు. అపార్థం చేసుకుంటాడు.

ఇంకొన్ని చోట్ల అతనికి వినపడినా వినపడనట్లు నటిస్తాడు. ఇలా రకరకాల వైరుధ్యాలు అల్లడానికి గణితానికి మించిన లాజికల్ రీజనింగ్ ఇంకేముంటుంది. నాలుగోది ఫార్ములాలు మాథమాటిక్స్ సైన్సు కలకలిపి లవ్ ఫార్ములాను డిఫైన్ చేద్దామని “100% లవ్” లో ఏ స్క్వేర్ బీ స్క్వేర్ పాటను రాయించాను. పంచ సూత్రాల్లో ఆఖరు ది. ఎనాలసిస్ నాకు చిన్న చిన్న కూడికలు తీసివేతలు, హెచ్చింపులు కూడా రావు కానీ కథను ఒద్దికగా పొందుపరిచేందుకు ఎనలిటికల్గానే ఆలోచిస్తాను.

తూ.గో.జిల్లాకు చెందిన రాజోలుకు దగ్గరలోని ఓ పల్లెటూరు “మట్టపర్రు” గ్రామం అమ్మనాన్నలకు మేము ఆరుగురం అందరిలోకి చిన్నవాడిని నేను. పెద్దన్నయ్య వెంకటేశ్వరరావు ఆయనకు సినిమాలుంటే ఇంకేదీ గుర్తు రాదు. ఎన్టీఆర్ కు వీరాభిమాని ఇప్పుడు బాలకృష్ణ అభిమాని. చిన్నప్పుడు అమ్మతో అబద్ధాలు చెప్పి నన్ను సైకిలుపై ఎక్కించుకొని థియేటరుకు తీసుకెళ్ళేవాడు. ఆయనవల్లే నాకూ సినిమాలపై అభిమానం ఏర్పడింది. “రంగస్థలం” సినిమా ఫస్టు షో చూసి ఈ సినిమాతో నీవు చరిత్ర సృష్టిస్తున్నావురా అన్నారు. పెద్దక్క సీతామహాలక్ష్మి ఆ పేరు వినడానికి హాయిగా ఉంటుంది కానీ మాట మాత్రం కఠినం అబద్ధం చెబితే తాట తీస్తుంది” ఏంట్రా ఎప్పుడూ ఆ తొక్కలో సినిమాలు. ఓ నువ్వు పెద్ద డైరెక్టర్వు పాపం, నీ కోసం పిల్లలు ఎదురుచూడాలి అసలు నువ్వు వాళ్ళను పట్టించుకుంటున్నావా? అనేస్తుంటుంది. ఇంకో అన్నయ విజయకుమార్ మాకందరికి చిట్టిబాబు. ఆ పేరునే “రంగస్థలం" హీరోకు పెట్టేశా. మా చిట్టిబాబుకూ కోపం ఎక్కువే మరి. ఇక మరో అన్నయ్య విజయప్రసాద్ ఇంటికి ఆర్ధిక పెద్ద. అప్పట్లో “మట్టపర్రు గ్రామములో తాగునీళ్ళు ఉండేవి కావు. అటూ ఇటూ బిందెలు కట్టుకొని కావిళ్ళతో నీళ్ళు మోసేవాడు. ఉదయాన్నే ఇరవై కావిళ్ళు నీళ్ళు తీసుకొచ్చేవాడు. ఆ బరువుకు భుజం బొప్పి కట్టింది. చిన్నక్క విజయలక్ష్మి ఇంట్లో నన్ను చితక్కొట్టేది బడికి వెళితే మాత్రం ఎవరినీ పల్లెత్తు మాట అననిచ్చేది కాదు నేను రాసిన తొలి కవితను అక్కకే చూపించాను. అప్పట్లో చేకూరి రామారావు రాజోలు వస్తే నా కవితను ఆయనకు ఇచ్చాను. ఆ తరువాత ఆంధ్రజ్యోతిలో ఆయన రాసిన చేరాతలులో నన్ను ప్రస్తావించడం గొప్ప అనుభవం.

లియో టాల్స్టాయ్ అనగానే అందరికీ “యుద్ధమూ శాంతి" నవల గుర్తుకొస్తుంది. నాకు మాత్రం "కోసక్కులు" విపరీతంగా నచ్చింది. అందులోని విపులత, నాకల్పనాత్మక ప్రపంచాన్ని పెంచింది. “దోస్తో విస్కీ” శ్వేతరాత్రులు వల్లే “ఆర్య” చిత్రాన్ని తీయగలిగాను. ఆ పుస్తకమే చదవకపోతే ప్రేమపట్ల ఇంత కాంక్షాపూరిత వాత్సల్యం ఉండేది కాదేమో! అదటు ఉంచితే నన్ను ఇప్పటికీ వెంటాడుతున్న ఒకే ఒక రచయిత. గుడిపాటి వెంకటాచలం

ఆయన "మ్యూజింగ్స్”. నాలో కొన్ని పెద్దది చేసింది సంఘం వేసిన కంచె దాటి ఇలా కూడా ఆలోచించవచ్చు అని చెప్పాడు చలంగారు. అత్యంత ఇష్టమైన మరో రెండు పుస్తకాలు "చెహోవ్ కథలు" బుచ్చిబాబు చివరకు మిగిలేది యండమూరి వీరేంద్రనాథ్ 'విజయానికి ఐదు మెట్లు" కూడా ఏదో పుస్తకంగా చెప్పుకోవచ్చు. రిలీజ్ అయ్యేవరకు ప్రతి సినిమా సూపర్ హిట్ కిందే లెక్క. అలా చూస్తే నేనిప్పటివరకు తీసిన ఎనిమిది సినిమాలు హిట్టనే అనిపిస్తుంది. అయితే సినిమా రిలీజు అయ్యాక ఒపినీయన్స్ మారిపోతుంటాయి. నిన్ననే రామ్ గోపాల్ వర్మ ఫోన్ చేసి ఒక మాటన్నాడు. సినిమా హిట్ అయితే ఒక ఓపీనియన్. ఫ్లాప్ అయితే ఇంకో ఒపీనియన్లో కి వెళతాం అని. మనం ఏదైతే గొప్ప అనుకున్నామో అదీ మైనస్ అవుతుంది. ఇప్పటివరకు బాగా బూస్టప్ ఇచ్చిన చిత్రం "రంగస్థలం" అయితే ఎందులోనూ నూరుశాతం సంతృప్తి ఉండదు. ఉంటే అంతటితోనే ఆగిపోతాము. 2009లో మా వివామమైంది. మాది ప్రేమ వివాహం పెళ్ళి అయినప్పటికన్నా ఇప్పుడు అనుబంధం బలపడింది. తనను ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పుడు ముందే ఒకటి ఫిక్స్ అయ్యాను. ఎలాంటి విషయాన్నయినా నేను ఓన్ చేసుకోగలిగితేనే ప్రయాణం సజావుగా సాగుతుందని నమ్మాను. మా యిద్దరి మధ్యా చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పుడు ఐదునిమిషాల్లోనే సారీ చెప్పేస్తాను. ఈ 12 సం॥రాలలో అలాగే సారీ చెప్పిన సంఘటనలు అనేకం. అయితే తను మాత్రం ఎప్పుడూ సారీ చెప్పదు. ప్రాబ్లమ్ నా వల్లే వస్తుంది. కాబట్టే సారీ చెప్పే అవకాశం ఆమెకు రాదు. ఒకవేళ తన వైపు నుంచి ప్రాబ్లమ్ ఉన్నప్పటికి చెప్పదు.

నా మొత్తం జీవితంలో పది ముఖ్యమైన విషయాలను తీసుకుంటే వన్ టు టెన్ పిల్లలే! వాళ్ళ తర్వాతే ఇంకేదైనా! పుష్ప-1 సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ గారి చిత్రంలో హిరో అల్లు అర్జున్ గారికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది.

పొన్నూరి రాఘవేంద్ర