నంది అవార్డు గ్రహీత గుమ్మడి గోపాలకృష్ణ నట పరిశోధకుడు 

   జననం: 1955లో కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలం, మేడూరు గ్రామంలో జన్మించారు.ప్రముఖ పాత్రలు: శ్రీనాథుడు, శ్రీకృష్ణ తదితర పద్యనాటక పాత్రలతో విశేష ఖ్యాతి గడించారు.

ప్రముఖ రంగస్థల నటులు, పద్యనాటక గాన గంధర్వుడు గుమ్మడి గోపాలకృష్ణ 1999 సంవత్సరంలో 'శ్రీనాథుడు' నాటకానికి గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు.

    పురస్కారం: తెలుగు పద్యనాటక రంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను ప్రతిష్ఠాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు (2024 సంవత్సరానికి గాను) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.

  పురస్కారాలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ పురస్కారం, కళారత్న పురస్కారం పొందారు.

    సినిమారంగం పుత్రిక అయితే, నాటక రంగందానికి మాతృక. అటువంటి నాటకం రంగంలో ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి ప్రేక్షకుల్ని మైమరపించే నటసంపద మెండుగా ఉన్న నటుడు మన గుమ్మడి గోపాలకృష్ణ, ఆయన ఇంట కొలువుదీరిన 12 నందులు, ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇందులో మూడు పోటీలో సాధించినవైతే మిగతావి ఆయా నాటక పోటీలకు వివిధ హోదాల్లో సేవలందించినందుకు అందుకున్నవి. అందుకే మూడు ఉత్తమనందులు" మూడు ఉత్తనందులు అని చమత్కరిస్తారాయన, ఆకర్షణీయమైన రూపం, మృధుమధుర గంభీరమైన స్వరం ఆయనకు దేవుడిచ్చిన వరం. అందుకే దేశ విదేశాల్లో ఆయన నాటకం కోసం ఎదురుచూపులు చూస్తుంటారు. అభిమానజనం, నాటకరంగంలో ఒక నటుడికి అభిమాన సంఘం ఏర్పడటం, ఒక గోపాలకృష్ణకే చెల్లు, నాటకమంటే ఏ మాత్రం ఆసక్తిలేని ఆయన తల్లిదండ్రులు ఆయనకు "గోపాలకృష్ణ"గా నామకరణం చేయడం నాటకాల్లో. ఆయన శ్రీకృష్ణుని పాత్రతోనే ఎక్కువ పేరు తెచ్చుకోవడం యాదృచ్ఛికం. ఏ పాత్ర ఎంచుకున్నా దాని పుట్టు పూర్వోత్తరాలు పరిశోధించి ఆ పాత్రలో ఒదిగిపోవడం ఆయన నైజం. అంతర్జాతీయ రంగస్థల నటులు 12 నంది అవార్డులు, 16 ఎన్.టి.ఆర్ అవార్డులు అందుకున్నారు.

    గుమ్మడి గోపాలకృష్ణగారు 1955 సం॥లో కృష్ణాజిల్లా, పమిడిముక్కల మండలం మేడూరు గ్రామంలో కాపు కుటుంబంలో గుమ్మడి నాంచారయ్య శ్రీమతి మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం, నాటకమే. నాకు శ్వాసధ్యాస అంటారు. ఆయన పదవ తరగతి వరకు చదువుకున్నారు. నాటకరంగంలో పి.హెచ్.డి స్థాయిలో పరిశోధన చేశారు. ఆయనకు శ్రీకృష్ణుడు, శ్రీనాథుడు పాత్రలు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చాయి. ఆయన ఎక్కువగా, శ్రీకృష్ణరాయభారం, శ్రీకృష్ణ తులాభారం, చాలాచోట్ల ప్రదర్శనలు జరిగాయి. అమెరికాలో తెలుగువారు నాటకాలపై అమిత ఆసక్తి చూపేవారు. అందువలన వారి పిల్లలకు గోపాలకృష్ణ గురువుగా నటనలో శిక్షణ యిచ్చారు. ఆయన రెండుసార్లు ఉత్తమనటుడిగా, ఒకసారి ఉత్తమ దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. ఆయన ఆరాధ్యదైవం భగవాన్ సత్యసాయిబాబా (పుట్టపర్తి) బాబాగారు మాత్రమే ఆసీనులగు "పాన్పు”ను ఆయన స్వయంగా ఆయన శిష్యబృందము చేత తెప్పించి నాటక ప్రదర్శన వేయించి శ్రీకృష్ణ రాయభారం నాటకంలో పడక సీనును గుమ్మడి గోపాలకృష్ణ గారిచే ప్రదర్శింపచేసిన అపూర్వ అదృష్టం ఆయనకే దక్కింది. ఆ అదృష్టం ఏ నటుడికి దక్కలేదు. ఆయన ఉదయం సాయంత్రం యోగా చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంచే పండ్రెండు (12) నంది అవార్డులు అందుకున్నారు. ఆయన పొందిన సన్మానాలు, సత్కారాలు, బిరుదులు లెక్కలేనన్ని ఉన్నాయి.

     శ్రీకృష్ణతులాభారంలో వీరు, వీరి హావభావాలు, శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకున్నట్లు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కవి సార్వభౌమ శ్రీనాథుడు మున్నగుపాత్రలు పోషించుటలో అగ్రగణ్యులు. వీరి పద్యపఠనం డైలాగ్ డెలివరీతీరు. అనితరసాధ్యం ఆధునిక ప్రపంచమునకు తగినట్లుగా అత్యంత నవీన సాంకేతిక పద్ధతులలో వీరి నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను మైమరపించి ఆనందింప చేస్తాయి. ఇతర దేశాలలో కూడా నాటక ప్రదర్శన లిచ్చారు. చాలా పర్యాయములు. అమెరికాలో ప్రదర్శన లిచ్చారు. చాలా పర్యాయములు అమెరికాలో ప్రదర్శనలిచ్చారు. అమెరికాలో తెలుగు కళాకారులను తయారుచేసి శ్రీకృష్ణరాయబారం పద్యనాటకం నేర్పించి ఆయన దర్శకత్వంలో వారిచే ప్రదర్శింప చేశారు. సింగపూర్లో కూడా వారికి నేర్పించి వారి చేతనే నాటకాలు వేయించారు. నాటకరంగాన్ని భావితరాల కోసం, ఆయన ప్రదర్శించిన నాటకాలు, డి.వి.డి, సి.డి.ల రూపొందించి విదేశ, స్వదేశ తెలుగువారికి అందించి నాటకకళకు, ఎనలేని కీర్తి కలుగచేయుచున్నారు. అమెరికాలో 15 రాష్ట్రాలలో శ్రీనాథుడు నాటకం ప్రదర్శనలిచ్చి ప్రతిచోటా "Staludingovation" అందుకున్న మేటినటులు, అమెరికాలో "నటభారతి” బిరుదు అందుకున్న ఏకైక నటుడు. వీరు టి.వి. బుల్లితెరపై నాటకాలు, ప్రదర్శనలు, పరిచయాలు నిర్వహించుచున్నారు. “యోగివేమన" జీవిత చరిత్రపై పరిశోధన చేసి “వేమన యోగి" సీరియల్ ABN ఛానల్లో ప్రదర్శించారు. తర్వాత “పరమానందయ్య శిష్యులు కథ"లో పరమానందయ్యగా నటించి 3D ఫిలిమ్ రూపొందించి ప్రదర్శించారు. మంచిస్పందన వచ్చింది.

    స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు అవార్డు, దాసరి గారి ప్రశంసలు అందుకున్నారు. 2017 సం॥ జూన్ నెలలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లలితకళలు, నాటకరంగ ఛైర్మన్ గా పదవి నిర్వహించారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ కృష్ణానగర్లో నివసిస్తూ ఉన్నారు.

 భటరుశెట్టి పద్మారావు రాయలు