శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు (ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా).

   కృష్ణాజిల్లా మచిలీపట్నం (బందరు) వాస్తవ్యులైన బ్రిటీష్ సైనికాధికారి రఘుపతి అప్పయ్య నాయుడు శ్రీమతి శేషమ్మ దంపతులకు (బలిజ కాపు కుటుంబం) వీరికి ఇద్దరు కుమారులు, బ్రహ్మర్షి సర్. రఘుపతి వెంకటరత్నం నాయుడు తమ్ముడు రఘుపతి వెంకయ్యనాయుడు గారు బందరులో 15-10-1869 సం॥లో జన్మించాడు. ఆయనకు 17 సం॥ వయస్సులో చిత్రలేఖనము, శిల్పాలు చెక్కేవారు. ఆయన ఫోటోగ్రఫీ మీద మక్కువతో ఆవిద్యలో ప్రావీణ్యం సంపాదించి

1896లో మద్రాసులో ఫోటో స్టూడియో మౌంట్ రోడ్లోని 161వ నెంబరు ఇంటిలో స్టూడియో నడుపు తుండెడివాడు. ఓ పత్రికా ప్రకటన ఆయనను ఆకర్షించింది. లండన్లోని “గేమౌంట్ కంపెనీ" వారు "క్రోనో మెగాఫోన్" అనే సినిమా ప్రదర్శనా యంత్రాన్ని కొత్తగా కనిపెట్టారని అది కదిలే బొమ్మల్తో పాటు బొమ్మల ధ్వనులను కూడా వినిపిస్తుందని ప్రకటనలో ఉంది. వెంటనే “కదలే బొమ్మల" వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్న నాయుడు, మద్రాసులోని "జాన్ డికెన్సన్ అండ్ కంపెనీ" ద్వారా ఈ యంత్రానికి ఆర్డరు ఇచ్చారు. అప్పట్లోనే 30వేల విలువైన ఈ పరికరాన్ని కొనడానికి తన స్టూడియో తాకట్టు పెట్టి మూడు నాలుగొందలు అడుగుల నిడివి మేరకు పార్ట్స్ కూడా దానితోపాటు తెప్పించిన నాయుడు 1909లోనే మద్రాసులోని విక్టోరియా పబ్లిక్ హాలులో తన మొదటి సినిమా ప్రదర్శన యిచ్చారు. ఆయన ప్రదర్శించిన చిన్న విదేశీ చిత్రాలలో "అండర్ ది పనామా, స్వింగ్ సాంగ్, సీ సర్పంట్" వగైరా ఉన్నాయి. కొందరు చరిత్రకారులు వీరి మొదటి ప్రదర్శన 1910 అంటున్నారు. కానీ, దక్షిణ భారతీయ ప్రారంభ సినిమా చరిత్ర మీద విశేష పరిశోధన చేసిన "దియోడర్ భాస్కరన్ గారు కానీ, సైలెంట్ సినిమా" గ్రంథంలో అత్యుత్తమ చలనచిత్ర గ్రంథానికిచ్చే జాతీయ పురస్కారాన్ని సాధించిన "పసుపులేటి పూర్ణచంద్రరావు" గారు గానీ, 1909 సం॥ ప్రాంతంలోనే రఘుపతి వెంకయ్య నాయుడు సినీరంగ ప్రవేశం చేసినట్లు తెలిపారు. నాయుడుగారు మద్రాసు ప్రెసిడెన్సీలోనే గాక సిలోన్, బర్మా కూడా వెళ్ళి డేరాలు వేసి సినిమాలు ప్రదర్శించినట్లు "తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర"లో రాశారు. కానీ ఖచ్చితంగా ఏ సంవత్సరాల్లో వెళ్ళారో సరిగ్గా రికార్డు చేయలేదు. అయితే నాటక రంగశాలలు అంతరించి భవిష్యత్తులో సినిమా హాళ్ళు దేశములో అవతరించ నున్నాయని గ్రహించిన వాళ్ళలో దక్షిణ భారతదేశంలోనే ప్రథముడు శ్రీ రఘుపతి వెంకయ్యనాయుడు గారు ఈ దూరదృష్టి వల్ల నాయుడు మద్రాసులో మొట్టమొదటి సినిమా థియేటర్ "గెయిటీ థియేటర్"ని తర్వాత మింట్ట్లో "క్రౌన్ థియేటర్” పరశు వాకంలో “గ్లోబ్ థియేటర్"లు నిర్మించారు. ఇవన్నీ 1912 సం|| నాటి సంగతులు, 1913 సం॥లో గ్లోబ్ థియేటర్ వెనుక స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలిమ్స్ బేనర్", ఆబేనరు కోసం "గ్లాస్ స్టూడియో"కి అంకురార్పణ చేశాడు. చరిత్రలో దక్షిణ భారతదేశంలో తొలి థియేటర్, తొలి స్టూడియోని నెలకొల్పిన వారు రఘుపతి వెంకయ్యనాయుడు అప్పటి వరకూ ఎగ్జిబిటర్ అయిన నాయుడుగారు "మన మెందుకు సినిమాలు తీయకూడదు?" అనిపించి తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ని నిర్మాణరంగంలో దింపాడు. సూర్యప్రకాష్ను అందరూ ప్రకాష్ అని పిలిచేవారు.

  రఘుపతి ప్రకాష్ అక్కడక్కడ కెమెరా క్రాంకింగ్ చేయడం నేర్చుకొని ఏ కంగా సినిమాలు తీసివేస్తున్న తమిళనాట రాజ మొదలియార్లా కాకుండా తన కొడుకు చేత అమెరికన్ సినిమా లాంటి టెక్నికల్ ఫర్ఫెక్ట్ సినిమాల్ని తీయించాలనుకున్న నాయుడు గారు డబ్బుకు సమస్య లేకపోవడంతో ప్రకాష్ను పిలిచి చేతి నిండా డబ్బు ఇచ్చి "నువ్వు లండన్ వెళ్ళి నేర్చుకురా" అని ఆశీర్వదించి కొడుకును లండన్ పంపాడు.

    1919వ సం॥ అప్పటికి రఘుపతి సూర్యప్రకాష్కు పద్దెనిమిదేళ్ళు, రఘుపతి వెంకయ్య నాయుడు అప్పటికే మద్రాస్ లో మూడు సినిమాహాళ్ళకు అధిపతి. అనేక వందల విదేశీ సినిమాల్ని తన థియేటర్లలో చూపిన నాయుడికి టెక్నికల్లీ బెటర్ సినిమా ఏంటో తెలుసు. రఘుపతి ప్రకాష్ కు తెలుసు. చాలామంది భారతీయుల్లా పౌరాణిక కథలను లుంగజుట్టి చూపించేయడం, నాయుడికి నచ్చలేదు. భారతదేశంలో కూడా పర్ఫెక్ట్ గా తీయించాలనుకున్నారు. ఆ పని తన కొడుకు చేత చేయించాడు. అలా లండన్ వెళ్ళిన సూర్యప్రకాష్, అక్కడి పెద్ద స్టూడియో "బార్కర్” మోషన్ పిక్చర్సు స్టూడియోలో అప్రెంటిస్ చేరాడు. అప్పటికి లండన్లో కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు అంటూ ఏమీ లేవు. ఏదైనా ఫిల్మ్ కంపెనీలో చేరి పనిచేస్తూ నేర్చుకోవడమే, నేర్చుకునేవాళ్ళ సంఖ్య పెరగడంతో ఈ బార్కర్స్ స్టూడియో కొంతఫీజు వసూలు చేసి విద్యార్థులకి ప్రతిదీ చెప్పి అన్నీ డిపార్ట్మెంట్సులో చూసి నేర్చుకునే అవకాశం కల్పించింది. ఇందుకే ఏకంగా ఐదువందల పౌండ్లు ఏడాదికి వసూలు చేసేవారు. అప్పటికి అది చాలా పెద్ద మొత్తం అయినా అంత డబ్బు చెల్లించి నాయుడు తన కొడుకు ప్రకాష్ని అక్కడికే పంపాడు. ప్రకాష్ వెళ్ళి నేర్చుకున్నాడు. అలా భారతదేశం మొత్తమ్మీద “ది ఫస్ట్ టెక్నికల్ క్వాలిఫైడ్ ఫిల్మ్ మేకరు"గా ఏడాది తర్వాత తిరిగి వచ్చాడు. దాదాపు అదేపని. దాదా సాహెబ్ పాల్కే కూడా చేశారు. ఆనాటికి ప్రపంచములో ఎక్కడా సినిమాకు మాటలు లేవు. సూర్యప్రకాష్ ఇటలీ, జర్మనీ, అమెరికా పర్యటించాడు. "టెన్ కమాండ్మెంట్స్” సినిమా నిర్మించిన "సిసిల్ బిడ్ మిల్లి" వద్ద కూడా పనిచేశాడు. జర్మనీలో ఎఫ్, డబ్ల్యు. ముర్మీన్ ని కూడా కలిసి అతను తీస్తున్న “ది బాయ్ ఇన్జూ” షూటింగ్ కూడా చూసి సినీ నిర్మాణ విధానము అధ్యయనము చేసి "విలియం సన్" అనే కెమెరాతో సహా భారతదేశం తిరిగివచ్చాడు. నాయుడుగారు ఆనందంతో పులకించిపోయాడు.

   1920 సం||లో సొంత స్టూడియో నిర్మాణం చేయించాడు. నాయుడుగారు సూర్యప్రకాష్ చేత ఆ స్టూడియోలో 1921 సం|| కల్లా తన మొదటి సినిమా "బీష్మ ప్రతిజ్ఞ"ని 12 వేలు రూపాయల బడ్జెట్లో తీస్తే 60 వేల రూపాయలు వసూలు చేసింది. అలా తెలుగు వాడి మొదటి సినిమాగా బీష్మ ప్రతిజ్ఞ చరిత్రపుటల్లో నిలిచిపోయింది. ఇలా తెలుగువాడి సినీ నిర్మాణానికి శుభారంభం జరిగింది. దీనికంటే ముందు సూర్యప్రకాష్ దర్శకత్వంలో మీనాక్షి కళ్యాణం అనే మూకీ సినిమా నిర్మించారు. అది 1913లో తీశారు. కానీ లెన్సు బాగాలేక క్రింద బాడీలు మాత్రమే వచ్చినవి. తలలు మాత్రము రాలేదు. తర్వాత లైన్సులు మార్చి సూర్యప్రకాష్ విదేశాలులో నేర్చుకొని తన దర్శకత్వంలో స్వంతంగా నిర్మించిన “గ్లాస్" స్టూడియోలో భీష్మ ప్రతిజ్ఞ తొలి మూకీ చిత్రం తీశారు. సూర్యప్రకాష్ గారు భీష్ముడి పాత్రవేసి తొలి హీరోగా నిలిచాడు. సినిమాకు భాషలేకపోయినా మూకీ సినిమా నిర్మించిన తొలి తెలుగు చలన చిత్ర నిర్మాతగా, హీరోగా స్టూడియో యజమానిగా పర్మినెంట్ సినిమా థియేటర్స్ యజమానిగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందారు. 1921 సం||లో స్టార్ ఆఫ్ ది ఈస్ట్ ఫిలిమ్స్ ప్రొడక్షన్స్లో భీష్మ ప్రతిజ్ఞ మూకీ సినిమా తీశారు. ఆ కాలంలో తెలుగు, తమిళంలో కథానాయికలు దొరికేవారు కాదు. భీష్మ ప్రతిజ్ఞలో కథా నాయకుడు, సూర్యప్రకాష్, గంగాదేవి పాత్రలో ఆంగ్లయువతి “నెగ్గికెస్టిలో” చేసింది. 1921 సం॥ బొంబాయి వెళ్ళి "దాదాసాహెబ్ పాల్కే" గారిని కలిసివారు నిర్మించిన చిత్రాలను దక్షిణ భారతదేశములో ప్రదర్శించడానికి డిస్ట్రిబ్యూషన్ హక్కులు పొందిన ఘనత నాయుడు గారిదే!

  తర్వాత సూర్యప్రకాష్ గజేంద్రమోక్షం, మత్స్యావతారం, భక్తనందనార్, విష్నులీల మొదలగు మూకీ చిత్రాలు తీశారు. ఈ చిత్రాలు ప్రదర్శించేటప్పుడు కథా గమనానికి తగ్గట్టుగా మంచి కంఠం గల వ్యాఖ్యాత, సన్నివేశానికి అనుగుణంగా కామెంటరి చెప్పేవారు. ఇది సందర్భోచితంగా హాస్యస్పోరకంగా ఉండటంతో ప్రేక్షకులు ఆనందించేవారు.

     ఉత్తర భారతదేశానికి దాదాసాహెబ్ పాల్కే ఎలాగైతే "పయనీర్"గా గుర్తిస్తున్నామో, అలాగే దక్షిణ భారతదేశములో పూర్తి నిడివి సినిమా నిర్మాణానికి పయనీర్ గా అసలు సిసలైన పయనీర్ గా "రఘుపతి సూర్యప్రకాష్"నే చెప్పుకోవాలి. పాల్కేకి ముందే ఓ ఫీచర్ ఫిల్మ్ ని లుంగ జుట్టినా కూడా, "దాదాతోర్న"ని చరిత్ర కారులు ఎలాగైతే విస్మరించి, టెక్నికల్లీ సినిమా విద్యను నేర్చుకొని తీసిన "దాదా సాహేబ్పాల్కే"ని ఎలా నిజమైన పయనీర్ కీర్తించాలి. ఎందుకంటే కెమెరా క్రాంకింగ్ నేర్చుకొని కొన్ని సినిమాల్ని 1916 సం॥ నాటికే లుంగజుట్టినా కూడా దక్షిణ భారత సినిమా పయనీర్ “నటరాజ మొదలియార్"ను కీర్తించడం తగదు. టెక్నికల్గా సిస్టమేటిగా సినిమా నిర్మాణరంగంలోకి దిగిన రఘుపతి సూర్యప్రకాష్కి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాలి. దక్షిణ భారత 'ఫీచర్ సినిమా' తొలి దర్శకుడు సూర్యప్రకాష్ కాబట్టి.

   ఇక్కడ గుర్తించాల్సిన అంశమేమంటే వెంకయ్య నాయుడు గారు ఒక ఎగ్జిబిటర్ మాత్రమేనని, నాయుడు కన్నా ముందు 1905లో "స్వామి కన్ను విన్సెంట్" కదిలే బొమ్మల్ని చూపించిన మొదటి దక్షణ భారతీయుడైనా ఆయన ఆపని తాత్కాలికంగా చేసి విరమించుకొని ప్రొజెక్టర్ల వ్యాపారంలోకి వెళ్ళాడు. కానీ నాయుడుగారు 1909 సం॥లో ఎగ్జిబిటర్గా ప్రవేశించి ఆ రంగాన్నే నమ్ముకొని, పర్మినెంట్ సినిమాహళ్ళ నిర్మాణం చేశాడు. తర్వాత పర్మినెంట్ స్టూడియో నిర్మాణం కూడా చేశాడు. కష్టపడి కొడుకుని లండన్ పంపించి ఓ టెక్నిషియన్గా తిరిగొచ్చిన తర్వాతే కొడుకు చేత సినిమా తీయించిన ధీశాలి. పదహాలు మూకీ సినిమాలు తీశారు. నాయుడు గారి పట్టుదల, అంకితభావము, స్థిరచిత్తంతో సినీ నిర్మాణానికి దక్షిణ భారతదేశంలో పునాదులు వేసిన నాయుడుగారి పట్టుదల, అంకితభావము, స్థిరచిత్తంతో సినీ నిర్మాణానికి దక్షిణ భారతదేశంలో పునాదులు వేసిన నాయుడుగారి పేరట "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురస్కారాన్ని నెలకొల్పి ఆ మహానీయుడిని స్మరించుకోవడం సంతోషించదగ్గ విషయం".

     నిజంగా సినిమాలను తీయడం మొదలు పెట్టింది. నాయుడుగారైనా నిజంగా సినిమాలను తీసిన ఘనుడు రఘుపతి సూర్యప్రకాష్ గారు. ఆయన సమకాలికుడుగా, ఏ.నారాయణన్ అనే మరో దర్శకుడు. రంగప్రవేశం చేసినా, మరికొందరు వచ్చినా, మూకీ సినిమాలకు బాగా గిరాకీ ఉండేది. దక్షిణ భారతదేశంలో అత్యధిక మూకీ సినిమాలను తీసిన ఘనుడు. ఒక్క రఘుపతి సూర్యప్రకాష్క మాత్రమే దక్కుతుంది. అలా రాశిలోనూ, వాశిలోనూ కూడా ప్రకాష్ అగ్రగణ్యుడు టాకీలయుగం రాగానే టాకీల నిర్మాణం కూడా చేశాడు. కాబట్టి దక్షిణ భారత సినీ పరిశ్రమలో పయనీర్ రఘుపతి సూర్యప్రకాష్ అనడమే న్యాయం. ఆ తర్వాత తరంలో గొప్ప దర్శకులుగా పేరొందిన వై.వి.రావు, సి. పుల్లయ్య గార్లు రఘుపతి సూర్యప్రకాష్ శిష్యులే 

     1921 సం॥లో ఒక్క సినిమాతో ప్రారంభమైన సూర్యప్రకాష్ సినీ నిర్మాణం, 1923 సం॥లో మూడు సినిమాలకు పెరిగింది. గజేంద్రమోక్షం, భక్త నందనార్, సముద్ర మధనం నిర్మించారు. కానీ స్టూడియో నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి, కాని 1924 సం|| కల్లా సూర్యప్రకాష్ కష్టాలు ఎదుర్కోక తప్పలేదు.

      1923 సం||లో సూర్యప్రకాష్ "ది కాథోచిస్ట్ ఆఫ్ కిల్ ఆర్ని" పేరట కాథలిక్ ప్రోపగాండాఫిల్మ్ తీశాడని "యాన్ ఎన్ సైక్లోపీడియా" ఆఫ్ ఇండియన్ సినిమాలో ఉంది. క్రైస్తవ మత పెద్దలు సూర్యప్రకాష్ చేత ఐదురీళ్ళ సినిమాగా దీన్ని తీయించి ప్రదర్శించారు. ఈ సినిమాని "బోస్టన్"లో సక్సెస్ చేయించారు. అక్కడే మొదట 1923. అక్టోబర్ 23న విడుదలైంది.

       రిపోర్ట్ ఆఫ్ ది ఇండియన్ సినిమాటోగ్రఫీ కమిటీ, 1927-1928 ప్రకారం 1924 సం॥లో అప్పులు తీర్చకపోవడం వల్ల సూర్యప్రకాష్ తన తండ్రి వెంకయ్యనాయుడులు కలిసి నిర్మించిన "ది స్టార్ ఆఫ్ ఈస్ట్ స్టూడియో"ను దాని అఫిషియల్ అస్నెని తన ఆధీనంలోకి తీసుకొని డిస్మెంటల్ చేసి విడిభాగాలుగా అమ్మేశాడని తెలుస్తుంది. భారతదేశంలోనే అంత ఆధునికమైన స్టూడియోని వేరెవరైనా నడిపించుకోకుండా విడిభాగాలుగా అమ్మేసుకోవడం ఏమై ఉండవచ్చు? బాకీ ఉన్నవాళ్ళ ఒత్తిడి కారణమై ఉండవచ్చు. ఇటువంటి కారణాల వల్ల 1929 నాటికి బాధ్యతలన్నీ నాయుడు, ప్రకాష్క అప్పగించి తాను ఆరంగం నుండి తప్పుకున్నాడు. "స్టార్ ఆఫ్ ఈస్ట్ కంపెనీ” మూల పడిపోయినా ఆఫీషియల్ అస్పైనీ దగ్గరుండి ఎక్విప్మెంటును అద్దెకు తీసుకొని వెంటనే సినీ నిర్మాణానికి పూనుకొని ద్రౌపదీభాగ్య, ఉషా, స్వప్నవంటి సినిమాలు తీశారు. ద్రౌపది భాగ్య సినిమాని కొందరు చరిత్రకారులు "ద్రౌపది వస్త్రాపహరణం"గా రికార్డు చేశారు. ద్రౌపదీ భాగ్యచిత్రంలో “అఫ్టికల్ ఎఫెక్ట్" అందుబాటులో లేని ఆకాలంలోనే ఒకనటుడిని ఐదుసార్లు ఒకేచోట చూపించి సంచలనం సృష్టించారు ప్రకాష్ గారు. 1925 సం॥లో మద్రాసులో సూర్యప్రకాష్ తీసిన “మహాత్మా కబీర్ దాస్” కబీర్దాస్" తప్ప మరో సినిమా ఏదీ రికార్డుల కెక్కలేదు. సూర్యప్రకాష్ నిర్మాణదక్షత ఉన్నా సరైన వ్యాపార దక్షత లేదని. అప్పటి చరిత్రకారుల అభిప్రాయం, టాకీల యుగం నాటికి సినిమా రంగంలోకి వచ్చి చేరిన భూస్వామ్య కుటుంబాలవారు తొలిరోజుల నాటి సైలెంట్ సినిమావైపు కన్నెత్తి కూడా చూడలేదని తెలుస్తుంది. 1926లో మోహినీ అవతారం, 1929 లో స్టేజీ గర్ల్, లైలా స్టార్ ఆఫ్ మింగ్రేలియా, లంకా దహనం, గాంధియన్, పులంబాల్ చిత్రాలకు, 1930 నాటికి రఘపతి సూర్యప్రకాష్ దర్శకత్వం వహించగా వీటిలో "లైలా” స్టార్ ఆఫ్ మింగ్రేలియా చిత్రాన్ని సినిమాగా ప్రారంభించినా దీని తర్వాత 20 రీళ్ళ సీరియల్గా మార్చి దఫాలుగా విడుదల చేశారు.

అప్పటికీ మూకీలయుగం ముగిసిపోయి టాకీలయుగం ప్రారంభమైంది. 1931 సం|| హెచ్.ఎం.రెడ్డి “భక్తప్రహ్లాద" తో తెలుగు టాకీయుగం మొదలైనా 1931 సం॥లో సూర్యప్రకాష్ తన మూకీ చిత్రాలకు ఆదరణ తగ్గని కారణంగా, నిర్మాణాన్ని ఆపలేదు. 1931లో "పవళక్కోడి, నరనారాయణ, రోజ్ రాజస్థాన్ పేరట సైలెంట్ సినిమాలు, 1931లో విష్ణులీల అన్న మరో సైలెంట్ సినిమా తీశారు. సూర్యప్రకాష్ అలా భారతదేశం మొత్తం మీద అత్యథిక సైలెంట్ సినిమాలను తీసిన ఘనత (20 సినిమాలు) దక్కించుకున్న సూర్యప్రకాష్ ఆ తర్వాత పదహారు టాకీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించడం విశేషం, వాటిలో చండిక (1940) తారాశశాంకం (1942) ఎన్నదగినవి ఆనాటి ప్రేక్షకుల మాట 15-3-1941 తేది రఘుపతి వెంకయ్యనాయుడు గారు స్వర్గస్థులైనారు. తర్వాత రఘుపతి సూర్యప్రకాష్, 1956 సం॥ కన్ను మూశారు. అలాగే "భీష్మ ప్రతిజ్ఞ" చిత్రానికి సబ్స్టిల్స్ వంటివి ముద్రించి భారత ఉపఖండమంతా పంపిణీ చేశారని కూడా అందులో పేర్కొన్నారు. కానీ వాటికి సరైన ఆధారాలు లభించలేదు.

     ఇలా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకి బలమైన పునాది వేసిన రఘుపతి వెంకయ్యనాయుడు గారిని వారి కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ గారిని సదా స్మరించుకోవడం తెలుగు సినీ పరిశ్రమ కనీస ధర్మం ఆ తర్వాత తెలుగు తెరపై అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఒక వెలుగు వెలిగిన సుప్రసిద్ధ నటీమణి “దేవిక" రఘుపతి వెంకయ్యనాయుడు గారి మనవరాలు అన్న విషయం. చాలామందికి తెలియకపోవడం మరో విశేషం.

     భారతదేశంలో వెంకయ్యనాయుడు గారు తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా 1981 సం||లో తెలుగు సినీ పరిశ్రమ "రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు" ప్రారంభించి తెలుగు సినీమా రంగంలో ప్రతిభ గల వారికి ఆ అవార్డు ప్రదానం చేయుట ఆనవాయితీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

    ఆ అవార్డుకు "ఎనభై వేల నగదు" బంగారు పతకం, బంగారు నంది, శాలువా, ఇవి నంది అవార్డులలో భాగంగా ఇస్తారు.

        1981 నుండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున "రఘుపతి వెంకయ్య నాయుడు" అవార్డు అందుకున్నవారు.

1. ఎల్.వి.ప్రసాద్, 2. పి. పుల్లయ్య, 3. బి.ఎ. సుబ్బారావు, 4. ఎం.ఎ. రెహమాన్ (నృత్య దర్శకులు), 5. కొసరాజు రాఘవయ్య చౌదరి, 6. భానుమతి 7. బాపు రమణ, 8. బి. నాగిరెడ్డి, 9.డి.వి.ఎస్ఈజు 10. అక్కినేని నాగేశ్వరరావు, 11. దాసరి నారాయణరావు, 12. కె. విశ్వనాథ్, 13. సాలూరి రాజేశ్వరరావు, 14. దుక్కిపాటి మధుసూదనరావు, 15. కె.ఎస్.ప్రకాశరావు, 16. అంజలీదేవి, 17. ఇంటూరి వెంకటేశ్వరరావు 18. వి.మధుసూధనరావు, 19. గుమ్మడి వెంకటేశ్వరరావు, 20. శాంతకుమారి, 21. కాంతారావు, 22. పి.సుశీల, 23. వి.బి.రాజేంద్రప్రసాద్, 21. కృష్ణవేణి (జిక్కి) 25. అల్లురామలింగయ్య, 26, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గార్లు అందుకున్నారు.

 భట్టరుశెట్టి పద్మారావు రాయల్