🇮🇳 పద్మ విభూషణ్ మెగాస్టార్- డా!! కొణిదెల చిరంజీవి

పూర్తి పేరు: కొణిదెల శివశంకర వరప్రసాద్

పుట్టిన తేదీ: ఆగష్టు 22, 1955

జన్మస్థలం: పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు

రంగం: తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత, పరోపకారి మరియు మాజీ రాజకీయ నాయకుడు.

పురస్కారాలు: భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు

సినిమా ప్రస్థానం (Film Career)చిరంజీవి గారు 1978లో పునాదిరాళ్లు సినిమాతో నటన రంగంలోకి అడుగుపెట్టారు, అయితే ఆయన విడుదలైన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు. 

స్టార్‌డమ్ తెచ్చిన చిత్రాలు: 1983లో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి గారిని టాలీవుడ్‌లో తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత వచ్చిన పసివాడి ప్రాణం (1987), యముడికి మొగుడు (1988), జగదేకవీరుడు అతిలోకసుందరి (1990), ఘరానా  మొగుడు (1992), ఇంద్ర (2002), ఠాగూర్ (2003) వంటి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాయి 

మైలురాళ్లు:

రూ. 10 కోట్ల వసూళ్లు దాటిన మొదటి టాలీవుడ్ చిత్రంగా ఘరానా మొగుడు రికార్డు సృష్టించింది.

ఆయన నటించిన స్వయంకృషి (1987) చిత్రం మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.

150వ చిత్రంగా ఖైదీ నెం. 150 (2017) తో సుదీర్ఘ విరామం తర్వాత గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చారు.2026 సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ₹350 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయాన్ని అందుకుంది.

పురస్కారాలు 

(Awards & Honors)

పద్మ పురస్కారాలు: భారత ప్రభుత్వం నుండి 2006లో పద్మభూషణ్ మరియు 2024లో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారు.

ఇతర అవార్డులు: 9 ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌తో కలిపి), 3 నంది అవార్డులు మరియు రఘుపతి వెంకయ్య అవార్డులను గెలుచుకున్నారు

.గౌరవ డాక్టరేట్: ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్

రాజకీయ ప్రస్థానం

 (Political Career)ప్రజారాజ్యం పార్టీ: చిరంజీవి గారు 2008లో ప్రజారాజ్యం పార్టీ (PRP) ని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు.

కేంద్ర మంత్రిగా: 2011లో ఈ పార్టీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యునిగా ఎంపికై, 2012 నుండి 2014 వరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా (స్వతంత్ర హోదా) బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ పూర్తి సమయం సినిమాలకే కేటాయిస్తున్నారు

సేవా కార్యక్రమాలు (Philanthropy)1998లో ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (CCT) ను స్థాపించారు. దీని కింద చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి ఉచితంగా రక్తం మరియు కంటి చూపును అందిస్తూ సమాజసేవలో అగ్రగామిగా నిలిచారు. 

కుటుంబం (Family)

చిరంజీవి గారు ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు (సుస్మిత, శ్రీజ), ఒక కుమారుడు (ప్రముఖ నటుడు రామ్ చరణ్) ఉన్నారు. ఆయన సోదరులు నాగబాబు (నిర్మాత/నటుడు), పవన్ కళ్యాణ్ (నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి). అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి ప్రముఖ హీరోలు ఆయనకు మేనల్లుళ్లు అవుతారు.

మెగాస్టార్ చిరంజీవి గారి తండ్రి పేరు కొణిదెల వెంకట్రావు. ఆయన ఎక్సైజ్ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా (కొంతకాలం పోలీస్ కానిస్టేబుల్‌గా) పనిచేశారు

కొణిదెల వెంకట్రావు గారు పోలీసు కానిస్టేబులుగా ఉద్యోగము ప్రారంభించి హెడ్ కానిస్టేబులుగాను ఎక్సెజ్ ప్రొహిబిషన్ డిపార్టుమెంటులోనికి మారి అడిషినల్ సూపర్నెండెంటు ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ హోదాలో పదవీ విరమణ చేశారు. ఆయనకు ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. 1. శివశంకర వరప్రసాద్ (చిరంజీవి), 2. నాగేంద్రబాబు, 3. విజయదుర్గ 4. పవన్ కళ్యాణ్ బాబు 5. డా॥ మాధవి. వీరిలో పెద్దబ్బాయి శివశంకర వరప్రసాద్ గారే మన చిరంజీవి. ఆయన ప.గో.జిల్లా నర్సాపురంలోని మిషనరి ఆస్పత్రిలో 1955 సం॥ ఆగస్టు 22వ తేదీ సోమవారం ఉదయం 10గం. 5ని॥ జన్మించారు. చిరంజీవి తండ్రి ఉద్యోగి అయిన కారణంగా వివిధ ప్రాంతాలకు బదిలి అవుతుండడంతో చిరంజీవి స్కూలు చదువు గుంటూరు జిల్లా గురజాల (1వ తరగతి) మంగళగిరి (2,3 తరగతులు) పొన్నూరు (4, 5, 6 తరగతులు) మొగల్తూరు (7, 10 తరగతులు), బాపట్ల (8, 9 తరగతులు) సాగింది.చిరంజీవి ఇంటర్ ఒంగోలు శర్మ కాలేజి.

డిగ్రీ చదువు మరియు ఎన్.సి.సి (NCC)

కామర్స్ డిగ్రీ: ఒంగోలు, నర్సాపురాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత, చిరంజీవి గారు నర్సాపురంలోని ప్రముఖ శ్రీ వై.ఎన్. కాలేజీ (Sri Y N College) లో చేరారు. అక్కడ ఆయన బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశారు.

రిపబ్లిక్ డే పరేడ్: కాలేజీ రోజుల్లో ఆయన ఒక చురుకైన NCC క్యాడెట్గా ఉండేవారు. 1970ల ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఆయన పాల్గొన్నారు. ఈ క్రమశిక్షణే తర్వాతి కాలంలో ఆయన సినిమాల్లోని ఫైట్స్, అద్భుతమైన డాన్స్ మూమెంట్స్‌కు పునాదిగా నిలిచింది

మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రయాణంనటనపై ఆసక్తి: 

చిన్నప్పటి నుంచే నటనపై ఉన్న మక్కువతో, డిగ్రీ పూర్తి కాగానే నటుడిగా మారాలనే బలమైన కోరికతో ఆయన అప్పటి మద్రాసు (ఇప్పటి చెన్నై) నగరానికి ప్రయాణమయ్యారు 

మొదటి సినిమా మరియు 'చిరంజీవి'గా పేరు మార్పు

స్క్రీన్ నేమ్: ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. అయితే, వారి కుటుంబం ఆంజనేయ స్వామిని అమితంగా పూజించేది. ఒకరోజు ఆయనకు వచ్చిన కల ఆధారంగా మరియు వారి తల్లి అంజనాదేవి గారి సలహా మేరకు, "అమరుడు" (చిరంజీవిగా నిలిచేవాడు) అనే అర్థం వచ్చేలా తన పేరును **'చిరంజీవి'**గా మార్చుకున్నారు.

తొలి చిత్రం (షూటింగ్): ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన మొదట నటించిన సినిమా 'పునాదిరాళ్లు' (1978).

మొదటి విడుదల: కానీ, సాంకేతిక కారణాల వల్ల పునాదిరాళ్లు సినిమా ఆలస్యంగా విడుదలైంది. ఆయన నటించిన చిత్రాలలో థియేటర్లలో మొదటగా విడుదలైన చిత్రం 'ప్రాణం ఖరీదు' (1978). ఆ తర్వాత వచ్చిన బాపు గారి 'మనవూరి పాండవులు' (1978) సినిమా చిరంజీవి గారికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది 

 అందరికంటే ఎక్కువగా మెగాస్టార్, చిరంజీవి గారికి “ఎనిమిది ఇండస్ట్రీ రికార్డ్సు” సినిమాలున్నాయి. 1. ఖైది (4 కోట్లు) 2. పసివాడి ప్రాణం (4.5 కోట్లు) 3. యముడికి మొగుడు (5 కోట్లు) 4. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (5.25 కోట్లు) 5. జగదేకవీరుడు అతిలోక సుందరి (6.5 కోట్లు) 6. గ్యాంగ్జీడర్ (7 కోట్లు) 7. ఇంద్ర (10 కోట్లు) 8. ఘరానా మొగుడు (10 కోట్లు) తెలుగు సినిమా స్టామినాను పెంచిన సినిమాల పరంపర.

1996 సం||లో ఆయన సోదరులు, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2003లో మేనల్లుడు అల్లు అర్జున్, 2007లో చిరంజీవి ఏకైక కుమారుడు "రాంచరణ్ తేజ" హీరోలుగా రంగప్రవేశం చేశారు. తర్వాత అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తర్వాత చిరంజీవి మేనల్లుళ్ళు సాయిధరమ్ తేజ, వైష్ణవతేజ అనువారు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ సోదరి నిహారిక సినీరంగ ప్రవేశం చేశారు. తర్వాత అల్లు అరవింద్ బావమర్ది కుమారుడు ముత్తంశెట్టి కుటుంబం నుండి రాహుల్ అనే యువకుడు హీరోగా సినీ రంగ ప్రవేశం చేయనున్నారని తెలుస్తుంది. చిరంజీవి కుమార్తె శ్రీజ భర్త సినీ రంగ ప్రవేశం చేశారు. చిరంజీవి కుటుంబం ఇప్పుడు తెలుగు చిత్రసీమలో అగ్ర సినీ కుటుంబముగా అవతరించింది. అందుకే సినిమా వ్యాపారస్థాయిని, వసూళ్ళను ఘననీయంగా పెంచిన ఘనత చిరంజీవి నుండి ఆయన సినీ కుటుంబం (మెగా ఫ్యామిలీ) నుండి మరిన్ని అద్భుతాలు ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదు.

“చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు" స్థాపించి ఆత్మహత్య చేసుకున్న పత్తి రైతుల కటుంబాలకు ఆర్థిక సహాయమందించారు. 1998 సం||లో "చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంక్'ను ఆరంభించారు. అలాగే చనిపోయినవారి “కార్నియాలు” (కళ్ళు) సేకరించి నేత్ర నిథి ద్వారా ఎంతోమందికి మరలా చూపునిచ్చారు.

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT)

చిరంజీవి గారు కేవలం వెండితెరపైనే కాకుండా, సమాజ సేవలోనూ మెగాస్టార్‌గా నిలిచారు. ఆయన 1998 అక్టోబర్ 2న ఈ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. దీని కింద ముఖ్యంగా రెండు విభాగాలు పనిచేస్తున్నాయి:

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ (Chiranjeevi Blood Bank): 

రాష్ట్రంలో రక్తం కొరత వల్ల ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఆశయంతో దీనిని ప్రారంభించారు. లక్షలాది మంది అభిమానులు, సామాన్యులు ఇక్కడ రక్తదానం చేస్తూ ఎందరో ప్రాణాలను కాపాడుతున్నారు.

చిరంజీవి ఐ బ్యాంక్ (Chiranjeevi Eye Bank): అంధత్వ నివారణ కోసం నేత్రదాన ఉద్యమాన్ని చిరంజీవి గారు ఉధృతం చేశారు. మరణానంతరం నేత్రదానం చేయాలంటూ ఆయన స్వయంగా పిలుపునిచ్చి, ఎందరికో చూపు ప్రసాదించడానికి కారణమయ్యారు.

కోవిడ్-19 సమయంలో సేవలు (ఆక్సిజన్ బ్యాంకులు)కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు, మెగా ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో "చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్" ఏర్పాటు చేసింది. సొంత ఖర్చులతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించి వేలాది మంది ప్రాణాలను నిలిపారు.

చిరంజీవి తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించినప్పటికి కొన్ని తమిళ, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో ఆయన నటించారు. ఇంతవరకు 154 చిత్రాలను పూర్తి చేసుకున్న అగ్ర నటుడు దాదాపు ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్యం కనపరచడం విశేషం. ఆయన నటించిన చిత్రాలు.

1978

1. ప్రాణం ఖరీదు. హీరోయిన్ - రేష్మారాయ్

2. మన ఊరి పాండవులు

1979

3. తాయారమ్మ బంగారయ్య - హీరోయిన్ - మాధవి

4. కుక్కకాటుకు చెప్పుదెబ్బ - మాధవి

5. కొత్త అల్లుడు (విలన్)

6. పునాదిరాళ్ళు - రోజారమణి

7. ఇది కథ కాదు జయసుధ

8. కోతల రాయుడు - మాధవి

1980

9. చండీప్రియ, హీరోయిన్ - సువర్ణ

10. మోసగాడు (విలన్) హీరోయిన్ - శ్రీదేవి

11. పున్నమినాగు - మేనక (హీరోయిన్)

12. తాతయ్య ప్రేమలీలలు - గీత - సీమ

13. మొగుడు కావాలి గాయిత్రి

14. రక్తసంబంధం - సువర్ణ

1981

19. 47. రోజులు - జయప్రద

20. చట్టానికి కళ్ళు లేవు - మాధవి

21. కిరాయి రౌడీలు రాధిక

1982

22. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య- మాధవి

23. శుభలేఖ - సుమలత

24. ఇది పెళ్ళంటారా ? రాధిక

25. పట్నం వచ్చిన పతివ్రతలు రాధిక

26. బిల్లా - రంగా శ్యామలగౌరి

27. యమకింకరుడు రాధిక

28. మొండిఘటం- రాధిక

1983

29. ప్రేమపిచ్చోళ్ళు - రాధిక 

30. పల్లెటూరి మొనగాడు రాధిక

31. అభిలాష - రాధిక

32. ఆలయ శిఖరం సుమలత

33. శివుడు - శివుడు శివుడు రాధిక

34. పులి - బెబ్బులి రాధిక

35. గూఢాచారి నెం.1 - రాధిక

36. మగమహారాజు సుహాసిని

37. రోషగాడు - మాధవి

38. ఖైది - మాధవి, సుమలత

39. మంత్రిగారి వియ్యంకుడు - పూర్ణిమా జయరాం

40. సంఘర్షణ - నళిని

1984

41. అల్లుళ్ళు వస్తున్నారు - గీత

42. గూండా- రాధ

43. దేవాంతకుడు - విజయశాంతి

44. మహానగరంలో మాయగాడు విజయశాంతి

45. ఛాలెంజ్ విజయశాంతి, సుహాసిని

46. ఇంటిగుట్టు - నళిని

47. నాగు- రాధా 

1985

48. రుస్తుం - ఊర్వశి

49. చట్టంతో పోరాటం - మాధవి, సుమలత

50. దొంగ - రాధ

51. చిరంజీవి - విజయశాంతి

52. అడవిదొంగ - రాధ

1986

53. విజేత - భానుప్రియ

54. కొండవీటి రాజా - విజయశాంతి, రాధ

55. మగధీరుడు - జయప్రద

1987

56. చంటబ్బాయి - సుహాసిని

57. దొంగ మొగుడు - రాధిక, మాధవి, భానుప్రియ

58. ఆరాధన - సుహాసిని

59. పసివాడి ప్రాణం విజయశాంతి

60. స్వయంకృషి - విజయశాంతి

1988

61. రుద్రవీణ - శోభన

62. యముడికి మొగుడు విజయశాంతి, రాధ

63. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు విజయశాంతి

1990

64. జగదేకవీరుడు, అతిలోక సుందరి - శ్రీదేవి

1991

65. గ్యాంగ్డర్ విజయశాంతి

1992

66. ఘరానా మొగుడు - నగ్మా, వాణీ విశ్వనాథ్

67. ముఠామేస్త్రి - మీనా, రోజా

68. మెకానిక్ అల్లుడు - విజయశాంతి

1995

69. అల్లుడా మజాకా - రమ్యకృష్ణ

70. బిగ్బాస్ రోజా

71. రిక్షావోడు - నగ్మా, సౌందర్య

  1997

72. హిట్లర్ - రంభ

73. మాస్టర్ - సాక్షి శివానంద్, రోషిణి

1998

74. బావగారూ.. బాగున్నారా? రంభ

75. చూడాలని ఉంది - సౌందర్య, అంజలాజవేరి

1999

76. స్నేహం కోసం - మీనా

77. ఇద్దరు మిత్రులు - సాక్షి శివానంద్, రంభ, రమ్యకృష్ణ

2000

78. అన్నయ్య - సిమ్రాన్, సౌందర్య

2001

79. మృగరాజు - సిమ్రాన్, సంఘవి, రంభ

80. డాడి - సిమ్రాన్, ఆషియాబల్లా

81. మంజునాథ - మీనా, సౌందర్య

2002

82. ఇంద్ర - సోనాలిబింద్రె, ఆర్తి అగర్వాల్

83. ఠాగూర్ - జ్యోతిక, శ్రియ

2004

84. అంజి - నమ్రతా శిరోద్కర్

85. శంకర్ దాదా యం.బి.బి.ఎస్ - సోనాలి బింద్రే

86. అందరివాడు- టబూ, రిమ్మిసేన్

2005

87. జై చిరంజీవ - భూమిక, సమీరారెడ్డి

2006

88.స్టాలిన్ - త్రిష

2007

89. శంకర్ దాదా - కరిష్మా కోటక్ 

ముఖ్యమైన సినిమాల జాబితా ఇచ్చాము

90. సైరా

91. ఖైదీ నెంబర్ 150 

92. ఆచార్య

93. శ్రీరామభంటు

94. ఐ లవ్ యూ

95. అగ్ని సంస్కారం

96. ఛండీప్రియ

97. ఆరనిమంటలు

98. నకిలీమనిషి

99. లవ్ ఇన్ సింగపూర్

100. ప్రేమతరంగాలు

101. ప్రేమనాటకం

102. ఊరికిచ్చినమాట

103. ప్రియా

104. శ్రీరస్తు - శుభమస్తు

105. సీతాదేవి 

106. మంచుపల్లకి

107. రోషగాడు

108. సింహపురి సింహం

109. జ్వాలా 

110. రక్తసింధూరం

111. కిరాతకుడు

112. కొండవీటి రాజా

114. మంచిదొంగ

113. చాణక్యశపథం

116. శంకర్ దాదా జిందాబాద్

115. స్టాలిన్

118. కొదమసింహం

117. ప్రతిబంద్

120. స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్

119. ఆద్మిఔర్ అప్సర

122. ఆజాద్ దేశాకా అందా కానూన్

121. ఆజ్ కా గూండా రాజ్

134. స్నేహం కోసం

133. బిగ్ బాస్ 

136. మర్ద్ (హిందీ)

135. మంజునాథ

138, రాదా మై డార్లింగ్

137. మేరి ఇజ్జత్ (హిందీ)

139. వేట

140. ది జెంటిల్మెన్

141.ముగ్గురు మొనగాళ్ళు

142. హ్యాండ్సప్ 

143. హనుమాన్ (హిందీ) వాయిస్

144. అంధాకానూన్

145, సంఘర్షణ

146. భోళాశంకర్

147. అందరివాడు.

150. ఖైదీ నెంబర్ 150

151. ఆచార్య

152. గాడ్ ఫాదర్

153. వాల్తేరు వీరయ్య

154. మన శంకర్ వరప్రసాద్

Ponnuri Kumar