మరపురాని మహానటి సావిత్రి

తెలుగు సినిమా ఉన్నంతవరకు గుర్తుండి పోయే గొప్ప నటి సావిత్రిగారు ఏ తరహా పాత్ర పోషించినా అందులో ఇట్టే ఒదిగి పోవడం, తన ప్రతిభతో ఆ పాత్రకు వన్నె చేకూర్చడం సావిత్రి గారికి మాత్రమే సాధ్యమైన విద్య అనడంలో అతిశయోక్తి కాదు.

ఆరోజుల్లో ప్రతి వ్యక్తి సావిత్రి లాంటికూతురుండాలని, ఆమె లాంటి చెల్లెలుండాలని, అటువంటి ప్రియురాలుండాలని,అలాంటి భార్య ఉండాలని, ఆశపడేవారు. ఆమె జీవితం ఇతరులకు ఎంత ఆదర్శమో కేర్ఫుల్గా ఉండకపోతే, వ్యక్తి జీవితము ఎలా అతలాకుతలం అవుతుందో చెప్పడానికి కూడా ఆమె ఒక ఉదాహరణగా మిగిలింది. నటిగానే గాక, దర్శకురాలిగా, నిర్మాతగా, తన బహుముఖ ప్రజ్ఞను విస్తరింపచేసిన అద్భుత ప్రతిభాశాలి మనశిక్చంకరావు సావిత్రిగారు.నిశ్చంకరావు వెంకటస్వామి కుమారుడు గురవయ్య గారిది. గుంటూరు జిల్లా తెనాలి దగ్గర "చింతలపూడి" గ్రామం గురవయ్య నాయుడు విజయవాడలో హరికథలు చెబుతుంటే అతను ఆరు అడుగుల ఎత్తు, ఎర్రగా, అందంగా ఉండేవాడు. ఇతను "తెలగాలు" అని తెలిసి తెనాలికి 20 కి.మీ. దూరంలోని (ఈనాడు తాడేపల్లి మండలం) చిర్రావూరు గ్రామ నివాసి తన చెల్లెలు సుభద్రమ్మ (అల్లాడివారి ఆడపడుచు)ను ఇచ్చి వివాహంచేశారు. వీరిది పేద కుటుంబం తండ్రి రైసుమిల్లులో కూలి పని వ్యవసాయ పనులు చేసుకునేవారు. గురవయ్య నాయుడు సుభద్రమ్మ దంపతులకు చిర్రావూరు గ్రామంలో 1936-12-6 తేది సావిత్రి జన్మించింది. సావిత్రికి ఒక సోదరి ఉంది. ఆమె పేరు "మారుతి" - సావిత్రి 8 సం॥ వయస్సు వరకు చిర్రావూరులోనే ఉన్నది. తర్వాత తండ్రి గురవయ్య నాయుడు చనిపోగా తల్లి సుభద్రమ్మ తన అక్క దావులూరి అన్నపూర్ణమ్మ వద్ద కొన్నాళ్ళు ఉండాల్సివచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వలన మరో అక్క కొమ్మారెడ్డి దుర్గాంబ భర్త వెంకట్రామయ్య చౌదరి (కమ్మ) ఇంటికి చేరింది (ఆమె కులాంతర వివాహం చేసుకుంది) వారికి పిల్లలు లేని కారణముగా వారి అక్క ఆహ్వానం మేరకు ఇక్కడ బీద పరిస్థితిగా వున్నందున వారింటికి విజయవాడ చేరింది.

సావిత్రి వీధి బడిలో చదువుతుండగా నృత్యంపై ఆమెకున్న ఆసక్తిని గమనించి తర్ఫీదు ఇప్పించాడు వెంకట్రామయ్య గారు శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి గారి వద్ద శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకొని విజయవాడలో పలు ప్రదర్శనలిచ్చింది. 1994 సం॥ మొదటిసారిగా “రాధాకృష్ణ" నాటకంలో కృష్ణుడి పాత్రలో నటించి అందరి మెప్పు పొందింది. అరుణోదయ నాట్యమండలి సభ్యురాలిగా చేరి "కొంగర జగ్గయ్య" గారితో కలిసికొన్ని నాటకాలలో నటించిన సావిత్రి తర్వాత స్వతంగా "నవభారత నాట్యమండలి" నెలకొల్పి మరికొన్ని నాటకాలు ప్రదర్శించింది. బుచ్చిబాబు వ్రాసిన "ఆత్మవంచన" నాటకం. ఆమెకు మంచి పేరు తెచ్చింది. 12 సం॥ వయస్సులో "అగ్ని పరీక్ష" చిత్రంలో అవకాశం వచ్చినా ఆ పాత్రకు తగిన వయస్సు లేకపోవుటచే ఆ ఛాన్స్ మిస్సయింది. 1948 సం||లో వచ్చిన "బాలరాజు" చిత్రంలో నాగేశ్వరరావు గారు హీరో ఆ చిత్రం విజయవాడ జైహింద్ థియేటర్లో ఆడుతుంటే హీరో నాగేశ్వరరావు కారులో వచ్చాడు. అప్పటికి సావిత్రి వయసు 14 సం॥రాలు, ఆయనను చూడాలని జనమంతా చేరారు. సావిత్రి ఆ జనంలో దూరి తోసుకుంటూ "కారు" వరకు వెళ్ళింది. పోలీసులు జనాన్ని చెదరగొట్టడంతో ఆ తోపు లాటలో సావిత్రి ప్రక్కనే ఉన్న మురుగుకాల్వలో పడింది. ఆ విషయం సావిత్రి గారు 1962 సం||లో "మంచి మనసులు" శత దినోత్సవ సభలో చెప్పింది.

సావిత్రిని నటిని చేయాలని వెంకట్రామయ్య చౌదరిగారు తన కుటుంబాన్ని మద్రాసుకు మార్చాడు. L.V. ప్రసాద్ గారి "సంసారం" చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. మొదట ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు మరదలుగా అవకాశం వచ్చినా కెమెరా ముందు నటించడానికి ఆమె భయ పడుటచే చిన్న వేషం వేయాల్సి వచ్చింది. 1950-5-17 తేది తొలిసారిగా ముఖానికి రంగేసుకొని సంసారం చిత్రంలో "టక్కుట మారబండి... టంకాలబండి" అనే పాటతో తళుక్కుమంది. దీంతో పేరు తెచ్చుకొని ఆ తర్వాత “పెళ్ళి చేసి చూడు" చిత్రం. ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నృత్యరూపకుడు, దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వంలో "దేవదాసు" సినిమాలో ఆమెలోని ప్రతిభ వెలికి వచ్చింది. ఈ చిత్రంలో విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. చిత్ర సీమలో అగ్ర కథానాయికగా సుస్థిరస్థానం సంపాదించు కుంది.

అర్ధాంగి, మిస్సమ్మ, దేవదాస్, మాయాబజార్ అప్పు చేసి పప్పుకూడు. గుండమ్మ కథ, దీపావలి, మూగమనసులు, దేవత, పాండవవనవాసం, నర్తనశాల, వరకట్నం, కన్యాశుల్కం, కోడలు దిద్దిన కాపురం రక్తసంబంధం, కంచుకోట, తోడికోడళ్ళు, మిస్సమ్మ ఇలా అనేక సినిమాలలో ఆమె చేసిన ప్రతిచిత్రం. విభన్నమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల మనసులలో మహానటిగా మిగిలిపోయింది. దాదాపు 318 సినిమాలలో నటించింది. గ్లిజరన్ లేకుండా మాయాబజార్లో ఏ కంటికి నీళ్ళు రావాలంటే ఆకంటికి నీళ్ళు తెప్పించి K.V.రెడ్డికి సవాల్ విసిరింది.

చిన్నారి పాపలు అనే సినిమాకు దర్శకత్వం వహించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించింది తెలుగు అగ్రకథా నాయకులతోనే గాక, తమిళ అగ్ర కథానాయకులతో కూడా నటించింది. తెలుగులో ఎంతమంది అభిమానులున్నారో తమిళంలో అంతకంటే ఎక్కువగా ఉండేవారు.చిన్నారి పాపలు, చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. ఆమె ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలను ఎక్కువగా చూసేది. వాటి నుండి మంచి చెడ్డలను గురించి ఆమె విపులంగా వివరిస్తుంటే అందరూ అలా ఆశ్చర్యపోయి వినేవారు “సోఫియా లారెన్స్" ఆమె అభిమాననటి. ఆమె నటనంటే ఆమెకెంతో ఇష్టం. క్రికెట్ అన్నా ఇష్టపడేది.

సావిత్రి జెమినీ స్టూడియోలో తమిళ చిత్రాలలో నటిస్తున్నపుడు నటుడు జెమిని గణేశన్తో పరిచయమయింది. ఆ పరిచయం ప్రణయంగా మారింది. తనకు ఇంతకుముందే రెండు పెళ్ళిళ్ళు అయిన ప్రబుద్ధుడు మాటలు నమ్మింది. తనకు పెళ్ళి కాలేదన్నట్లుగా నమ్మించాడు. చాలామంది హెచ్చరిస్తున్నా అతని మాటలు నమ్మింది 1952 సం॥లో జెమినీ గణేశన్ను రహస్యంగా వివాహం చేసుకున్న సావిత్రి 1958 డిసెంబర్ 2 తేది తొలిబిడ్డ విజయ చాముండేశ్వరికి జన్మ నిచ్చింది. తర్వాత సతీష్ అనే మరోబిడ్డకు జన్మనిచ్చింది. సావిత్రి తారా స్థాయిలో ఉన్నపుడు హీరోలను మించి రెమ్యూనిరేషన్ తీసుకున్నదంటే ఆమె ఏ స్థాయి నటిగా ఎదిగిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. కాలికి బంగారు పట్టీలు ధరించిన వైభవం ఆమెది. తన సొంత బంగారు నగలు ధరించి షూటింగ్లలో పాల్గొనేది. ఆమె కట్టిన చీరెలు ఆమె స్వంతం, నిర్మాతవి కట్టేది కాదు. ఆమె సున్నిత మనస్కురాలు తిరుగులేని తారగా ఎదిగిన మాట వాస్తవమే. అయినప్పటికి మనుషులలోని కుళ్ళు కుతంత్రాలు అక్కడే చూచింది. వలచి వరించిన తోడు మోసగాడని తెలియడం, పైగా నాచెప్పుచేతలలో నీవుండాలని చెప్పడం చూసి ఆమె కలత చెందింది. ఆమె తన భర్తకు తనకంటే ముందు రెండు పెళ్ళిళ్ళు జరిగాయని తెలియడంతో ఆమె వైవాహిక జీవితం నిస్తారమయింది. తాను మోసపోయానని తెలుసుకునే నాటికి 1956 సం|| ఆమె జీవితాన్నే మార్చేసింది. ఉన్నత స్థానము నుండి పతనం ప్రారంభమైంది. తెలుగులో విజయవంతమైన "మూగమనసులు" చిత్రాన్ని తమిళంలో "ప్రాప్తం" పేరుతో స్వీయ దర్శకత్వంలో నిర్మించింది. చిత్రం హిట్ కాకపోవడంతో నాకు ప్రాప్తం లేదు అనేవారు సావిత్రిగారు.

తన జీవితంలో అన్నీ కోల్పోయేస్థితికి వచ్చింది. సున్నిత మనస్కురాలైన సావిత్రి ఈ అటుపోట్లను తట్టుకోలేక అల్లాడిపోయిన ఆ మహాతల్లి గొప్ప కరుణామయి కూడా!ఉజ్వలతారగా వెలుగొందే సమయంలో ఎక్కువగా దానధర్మాలు చేసేది ఎవరైనా సహాయం కోసమొస్తే సహాయమందించేది. తన నగలన్నీ ప్రధానమంత్రి (లాల్బహదూర్ శాస్త్రి) సహాయనిధికి దానమిచ్చిన ఉత్తమ పౌరురాలు, వ్యవస్థపట్ల మనుషుల పట్ల గౌరవము ప్రేమ గలిగిన మహామనిషి, ఈమెకు క్రికెట్ అంటే మహాఇష్టం. ప్రముఖల ఆటగాడు "గ్యారీసోబర్స్"కు అభిమాని, భావకురాలు, పూలు, వృక్షములు ప్రకృతి అంటే మహాయిష్టం.

సావిత్రి గారికి పిల్లలంటే ఎనలేని ప్రేమ. తన ఇద్దరు పిల్లలు విజయచాముండేశ్వరి, సతీష్ లంటే ఎంతో అభిమానంగా ఉన్నా మంచి క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసింది. కాస్త తీరిక దొరికినపుడు పిల్లలతో గడపడానికి ఆమె ఎంతో ఉత్సాహం చూపించేది. పిల్లల పైకి చెయ్యత్తడం గాని, పల్లెత్తు మాట అనడం గాని ఆమె ఎప్పుడూ చేయలేదు అయినా తల్లి అంటే ఆ పిల్లలు ఎంత ఆప్యాయంగా ఉండేవారో అంత భయపడేవారు కూడా !

వైవాహిక జీవితం చెదరిన తర్వాత మత్తుకుబానిసయై ఆస్థుపాస్థులన్నీ కోల్పోయి చిన్న గదిలో అద్దెకుండేది. ఆమె కాసింత అనురాగం ఆప్యాయతలకోసం తపించింది. సర్వస్వం కోల్పోయి జీవితం ముగిసిపోతుందన్న ఆవేదనతో కుమిలిపోయి మత్తుకు బానిసయింది.

ఆ సమయంలో నర్తనశాల సినిమాలో కీచకుడి మరణానంతరం ద్రౌపదిని ఒక బండిపై కట్టి అగ్నిప్రవేశం చేయించుట తీసుకుపోయే దృశ్యం చిత్రీకరించాలని కమలాకర కామేశ్వరరావు యింటికొచ్చారు. ఆమె మత్తులో ఉన్నారని కుమార్తె చాముండేశ్వరి అమ్మ ఈ పరిస్థితులలో రాలేదు అని చెప్పినా ఆయన కారులో ఎక్కించుకొని మేకప్ లేకుండా చిత్రీకరించారు. ఆ పరిస్థితులలో కూడా సావిత్రి అభినయాన్ని డైరెక్టరు మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారంటే నటనపట్ల ఆమెకున్న అంకితభావమలాంటిది. సావిత్రి తన కుమార్తె విజయ చాముండేశ్వరికి తన బంధువులు వడ్డి గోవిందరావు కిచ్చి వివాహం చేసింది. సావిత్రికి అల్లాడి, వడ్డి, బూరుగడ్డ, దావులూరు వారు బంధువులు సావిత్రి తండ్రి గురవయ్య నాయుడు గారి నలుగురు సోదరీమణులు కలరు. సావిత్రి కొంతకాలం కోమాలో ఉండి 1981-12-6 తేదీ అందరూ ఉన్నా, ఎవ్వరూలేని దానిలా కళామతల్లి ఒడిలో కన్ను మూశారు.

ఆనాడు, ఏనాడు, ఈనాడు ఎప్పటికీ మహానటిగా తన స్థానమును సుస్ధిరము చేసుకొని సినీ జగతి ఉన్నంతవరకు అందరి మనస్సులలో చిరంజీవియై జీవిస్తూనే ఉంటుంది. సావిత్రి లాంటి అపురూపమైన అరుదైన నటీమణి బలిజకాపు కులంలో జన్మించినందుకు గర్వంగా ఉంది. కొంతబాధగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం ఆమె పేరు మీద "పోస్టల్ స్టాంపు" విడుదల చేసింది. ఆమె జీవితం పుస్తకరూపంలో విడుదలయ్యింది. ఆమె జీవితంపై "మహానటి" పేరుతో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన సినిమా విడుదలై, సూపర్ హిట్ అయ్యింది (దులకర్ సల్మాన్ హీరో)

1962 సం||లో సావిత్రి గారి ఆర్థిక సహాయంతో సావిత్రి గణేషన్ పేరుతో గుంటూరు. జిల్లా రేపల్లె మండలం "వడ్డి వారి పాలెం"లో హైస్కూలు కట్టించారు. ఆ స్కూలులోచదివిన వారెందరో ఉన్నత స్థానములో ఉన్నారు. ప్రతి సంవత్సరం సావిత్రి జయంతి ఉత్సవాలు జరుపుతారు. 6-12-2006సం॥లో సావిత్రి 69వ జయంతి ఉత్సవాలు హైస్కూలులో ఘనంగా నిర్వహించారు. ఆ ఉత్సవాలకు సావిత్రి కుమార్తె విజయ ఛాముండేశ్వరి అల్లుడు గోవిందరావు గారు విచ్చేశారు. వీరికి ఇద్దరు సంతానం 1963-4-4 తేది సావిత్రి హైస్కూలు ఆవరణలో నాటిన రావిచెట్టు మహావృక్షమయింది. వారు ఆ రావిచెట్టులో సావిత్రిని చూసుకుంటూ పూజలు నిర్వహించారు.

సావిత్రి కుమారుడు సతీష్ కుటుంబం అమెరికాలో ఉంది. నిశ్చంకరావు గురువయ్య నాయుడు గారి దాయాదులు ఇప్పటికి చింతలపూడి గ్రామంలో ఉన్నారు. చిర్రావూరు గ్రామంలో తల్లిగారి పుట్టింటివారు, బంధువులు ఈనాటికీ ఉన్నారు. గుంటూరు లో సావిత్ర గారి నిలువెత్తు విగ్రహం పెట్టారు.

పొన్నూరి కుమార్